News July 4, 2024
జగన్ ఘర్షణ వాతావరణం సృష్టించాలని చూశారు: హోంమంత్రి అనిత

AP: జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు మాజీ సీఎం జగన్ రూ.25లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. ములాఖత్లు అయిపోయినా మానవతా దృక్పథంతో జగన్కు అనుమతి ఇచ్చామని తెలిపారు. కానీ ఆయన ఘర్షణ వాతావరణం సృష్టించాలని ప్రయత్నించారని, జైలు నుంచి బయటకు వచ్చి మీడియాతో ఏదేదో మాట్లాడి వెళ్లిపోయారని అన్నారు. గత ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ చేపడతామని పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
తగ్గిన చమురు దిగుమతులు.. డిస్కౌంట్స్ ఇస్తున్న రష్యా కంపెనీలు

అమెరికా ఆంక్షల కారణంగా కొనుగోళ్లు పడిపోవడంతో రష్యా చమురు కంపెనీలు భారీగా రాయితీలు ఇస్తున్నాయి. జనవరికి డెలివరీ అయ్యే ఒక్కో బ్యారెల్ చమురుపై 7 డాలర్ల వరకు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. రష్యా చమురు సంస్థలు రాస్నెఫ్ట్, ల్యూకోయిల్పై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించాయి. మరోవైపు, ఆ దేశం నుంచి కొనుగోళ్లు వద్దంటూ ఒత్తిడి చేస్తుండడంతో భారత రిఫైనరీలూ దిగుమతులు తగ్గించిన సంగతి తెలిసిందే.
News November 25, 2025
మహిళలకు మెగ్నీషియం ఎంతో ముఖ్యం

శరీరానికి ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం ఒకటి. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 300 మి.గ్రా మెగ్నీషియం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లు, ఎముకల ఆరోగ్యం, ఋతుస్రావం, ప్రెగ్నెన్సీ వంటి అన్ని దశల్లో మెగ్నీషియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. గుమ్మడి గింజలు, బచ్చలికూర, బాదం, జీడిపప్పు, పాలు, డార్క్ చాక్లెట్, చిక్కుడు, అవకాడో, పప్పు దినుసులు, అరటిపండు, సోయాపాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
News November 25, 2025
రేపే ఎన్నికల షెడ్యూల్!

TG: గ్రామాల్లో ఎన్నికల నగరా మోగనుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్ల జాబితా అందడంతో రేపు సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు SEC సిద్ధమైనట్లు సమాచారం. బుధవారం కుదరకపోతే ఎల్లుండి తప్పనిసరిగా షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. షెడ్యూల్, నోటిఫికేషన్, ఎన్నికల తేదీలపై ఇవాళ క్యాబినెట్ భేటీలో సీఎం రేవంత్ సర్కార్ తుది నిర్ణయం తీసుకోనుంది. అనంతరం వీటిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


