News June 29, 2024
ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనుకున్న జగన్?

AP: ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనిపించిందని పార్టీ నేతలతో మాజీ CM జగన్ అన్నట్లు తెలిసింది. కానీ 40% ఓట్లు చూసి ఆగిపోయానని వారితో చెప్పినట్లు సమాచారం. ‘ఫలితాల షాక్లోంచి బయటకు రావడానికి నాకు 2, 3 రోజులు పట్టింది. 40 శాతం ఓట్లు అంటే పెద్ద సంఖ్యలో జనం మన వెంటే ఉన్నారు. వారి కోసమైనా నిలబడాలి అనుకున్నా. అందుకే మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యా’ అని అన్నట్లు వార్తలొస్తున్నాయి.
Similar News
News November 25, 2025
జన్నారం: ‘ధాన్యంలో 17% లోపు తేమ ఉండాలి’

17% లోపు తేమ ఉంటేనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని జన్నారం మండలం దేవునిగూడెం క్లస్టర్ ఏఈఓ అక్రమ్ అన్నారు. మంగళవారం క్లస్టర్ పరిధిలోని దేవునిగూడెం, కామన్ పల్లి గ్రామ శివారులో ఎండకు ఆరబోసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రాత్రి వేళల్లో మంచి ఎక్కువగా పడుతుందని, దీంతో తేమశాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ధాన్యంపై కవర్లను తప్పకుండా కప్పాలని రైతులకు ఏఈఓ అక్రమ్ సూచించారు.
News November 25, 2025
కుర్రాళ్ల ఓపికకు ‘టెస్ట్’!

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో మన కుర్రాళ్లు తేలిపోతున్నారు. ఒకప్పుడు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ రోజుల తరబడి క్రీజులో నిలబడేవారు. బౌలర్ల సహనాన్ని పరీక్షించేవారు. కానీ ఇప్పుడున్న ప్లేయర్లు పరుగులు చేయడం అటుంచితే కనీసం గంట సేపైనా ఓపికతో మైదానంలో ఉండలేకపోతున్నారు. కోహ్లీ, రోహిత్, పుజారా, రహానేల తర్వాత టెస్టుల్లోకి వచ్చిన పంత్, నితీశ్, సుదర్శన్, జురెల్ దారుణంగా విఫలమవుతున్నారు.
News November 25, 2025
భార్య గర్భంతో ఉంటే.. భర్త ఇవి చేయకూడదట

భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ‘చెట్లు నరకడం, సముద్ర స్నానం చేయడం శ్రేయస్కరం కాదు. అలాగే క్షౌరం కూడా చేయించుకోకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చావు ఇంటికి వెళ్లడం మంచిది కాదు. శవాన్ని మోయడం అశుభంగా భావిస్తారు. గృహ ప్రవేశం, వాస్తు కర్మలు వంటివి కూడా చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తే దీర్ఘాయువు గల బిడ్డ జన్మిస్తుంది’ అని సూచిస్తున్నారు.


