News May 11, 2024

జగన్ మాకెప్పుడూ మిత్రపక్షం కాదు: మోదీ

image

AP: YCP మళ్లీ అధికారంలోకి రాదని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని, ఆ పార్టీకి ప్రజలు మళ్లీ ఓట్లు వేస్తారని తాను అనుకోవడం లేదన్నారు. కొన్ని విషయాల్లో YCP MPలు తమకు మద్దతిచ్చారని, అయినా.. CM జగన్‌ను తామెప్పుడూ మిత్రపక్షంగా భావించలేదని మోదీ చెప్పుకొచ్చారు. తాము రాజకీయ ప్రత్యర్థులమేనని స్పష్టం చేశారు. ఒక ప్రధానిగా అన్ని రాష్ట్రాల్లాగే AP అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటానన్నారు.

Similar News

News December 26, 2024

గ్రూప్-1పై దాఖలైన అన్ని పిటిషన్ల కొట్టివేత

image

TG: గ్రూప్-1 పరీక్షకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. జీఓ నంబర్ 29, రిజర్వేషన్ అంశాలపై అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వాదోపవాదాల అనంతరం వారి పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. దీంతో గ్రూప్-1 ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది.

News December 26, 2024

కోడలు శోభిత గురించి నాగార్జున ఏమన్నారంటే?

image

నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ పరిచయం కంటే ముందే తనకు ఆమె తెలుసని నాగార్జున చెప్పారు. ఆమె ఎంతో కష్టపడి ఈస్థాయికి వచ్చారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కోడలి వ్యక్తిత్వం, పనిలో నిజాయితీని కొనియాడారు. ఆమె వర్క్‌లో క్వాంటిటీ కంటే క్వాలిటీని చూస్తారన్నారు. ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారన్నారు. ‘చైతూ జీవితంలోకి శోభిత వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా. వారిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.

News December 26, 2024

టాలీవుడ్‌ను రేవంత్ టార్గెట్‌గా చేసుకున్నారు: అమిత్ మాలవీయ

image

CM రేవంత్ రెడ్డిపై BJP IT సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన అదుపాజ్ఞల్లో ఉండనందుకు, డబ్బు ఇవ్వనందుకు తెలుగు సినీ పరిశ్రమపై రేవంత్ కక్షగట్టారని మండిపడ్డారు. ‘రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ సర్కారు టాలీవుడ్‌ను లక్ష్యంగా చేసుకుంది. తెలుగు స్టార్లు, నిర్మాతలపై ప్రతీకారం తీర్చుకుంటోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రేవంత్ సర్కారు చెడ్డపేరును మూటగట్టుకుంది’ అని విమర్శించారు.