News September 25, 2024
పూజలకు పిలుపునిచ్చిన జగన్.. టీడీపీ కౌంటర్

AP: సీఎం చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు YCP నేతలంతా ఈ నెల 28న పూజల్లో పాల్గొనాలన్న జగన్ పిలుపునకు TDP కౌంటర్ ఇచ్చింది. ‘నీ కుటుంబం విగ్రహారాధన చేయదు. ఒక్కసారి కూడా భార్యను తీసుకుని పట్టు వస్త్రాలు ఇవ్వలేదు. భార్య గుడికి రాదని ఇంట్లోనే స్వామి వారి ఆలయం సెట్టింగ్ వేశావ్. లడ్డూలో జంతు కొవ్వు కలిపావ్. స్వామి వారంటే నమ్మకం, భక్తి లేని నీ లాంటి వాడా ఈ పిలుపు ఇచ్చేది?’ అని మండిపడింది.
Similar News
News November 22, 2025
యాపిల్ ఎయిర్డ్రాప్ ఫీచర్ క్రాక్ చేసిన గూగుల్

ఐఫోన్లలో ఉండే క్విక్ షేర్ ఫీచర్ ఎయిర్డ్రాప్ను గూగుల్ క్రాక్ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్లకు డేటా, ఫొటోలు, వీడియోలు ట్రాన్స్ఫర్ చేయవచ్చని వెల్లడించింది. యాపిల్ సహకారం లేకుండానే దీనిని సాధించామని గూగుల్ ప్రతినిధి అలెక్స్ మొరికోనీ తెలిపారు. పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అన్ని మోడల్స్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీని వల్ల యూజర్ల సేఫ్టీకి ఏ ఇబ్బంది ఉండదన్నారు.
News November 22, 2025
IIT హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.


