News October 22, 2024
లెక్కలేనన్ని దుర్మార్గాలు చేసిన జగన్: మంత్రి గొట్టిపాటి

AP: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. ఏ సీఎం చేయనన్ని దుర్మార్గాలు గత ఐదేళ్లలో జగన్ చేశారని విమర్శించారు. ఆయన చేసిన అరాచకాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమైందని చెప్పారు. ఇప్పుడు వైసీపీ నేతలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ చేసే కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Similar News
News January 25, 2026
థాంక్యూ ఇండియా: ఇరాన్

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో తమకు అండగా నిలిచినందుకు ఇండియాకు ఇరాన్ థాంక్స్ చెప్పింది. ‘మాకు మద్దతు ఇచ్చినందుకు ఇండియాకు కృతజ్ఞతలు. న్యాయం, జాతీయ సార్వభౌమత్వం విషయంలో ఆ దేశ వైఖరికి ఇది నిదర్శనం’ అని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫథాలీ అన్నారు. కాగా శాంతియుత నిరసనలను ఇరాన్ ప్రభుత్వం అణచేస్తోందంటూ UNHRC 39వ ప్రత్యేక సెషన్లో ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది.
News January 25, 2026
వేరుశనగలో ఇనుపధాతులోపం.. నివారణ

ఆకులలో పత్రహరితం తయారవడానికి ఇనుపధాతువు కీలకం. ఇది లోపించినప్పుడు వేరుశనగ మొక్క ఆకులు పసుపు రంగుకు మారతాయి. క్రమంగా ఆకు కొనలు ఎండిపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సమస్య నివారణకు 0.5 శాతంఅన్నబేధి(5గ్రా. లీటరు నీటికి), 0.1 శాతం నిమ్మఉప్పు(లీటరు నీటికి 1గ్రాము) కలిపిన ద్రావణాన్ని 4-5 రోజుల వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేసుకోవాలి.
News January 25, 2026
కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తా: ట్రంప్

చైనాతో ట్రేడ్ డీల్పై ముందుకు వెళ్తే కెనడాపై చర్యలు తప్పవని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశాన్ని సజీవంగా చైనా మింగేస్తుంది. వారి వ్యాపారాలు, సామాజిక నిర్మాణం, జీవన విధానాన్ని నాశనం చేస్తుంది. చైనా ఉత్పత్తులను అమెరికాకు పంపేందుకు కెనడాను డ్రాప్ ఆఫ్ పోర్టుగా ఉపయోగించాలనుకుంటే వాళ్లు పొరపాటు పడినట్లే. డీల్ చేసుకున్న మరుక్షణమే కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.


