News April 12, 2024
జగన్‌ను జైలుకు పంపుతాం: పవన్ కళ్యాణ్

AP: సీఎం జగన్‌ను జైలుకు పంపడం ఖాయమని, ఎన్నికలకు ముందా? తర్వాతా? అనేదే ప్రశ్న అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తాను విజయవాడ ఎయిర్‌పోర్టులో వేచి చూస్తుండగా ఓ న్యూస్ పేపర్‌లో ‘మోదీ గ్యారంటీ.. అవినీతిపరులంతా జైలుకే’ అనే హెడ్డింగ్ ఆకట్టుకుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాసుకొచ్చారు.
Similar News
News March 23, 2026
ఇవాళ ‘వాహన్’ పోర్టల్‌లోకి TG ఎంట్రీ

TG: కేంద్ర పరిధిలోని ‘వాహన్’ పోర్టల్‌తో రాష్ట్ర వాహనాల డేటా ఇవాళ అనుసంధానం కానుంది. ఈ సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఇకపై రిజిస్ట్రేషన్, వెహికల్ ఓనర్ అడ్రస్, పేరు మార్పు, RC డూప్లికేట్, పన్ను చెల్లింపు వంటి సేవలన్నీ ఆన్‌లైన్‌కు మారనున్నాయి. RTA ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే ఒకే పేరుపై <<19443159>>రెండో వాహనం<<>> కొంటే అదనంగా కట్టాల్సిన 2% లైఫ్ ట్యాక్స్ నేటి నుంచి రద్దవనుంది.
News March 23, 2026
షాకింగ్.. మాజీ ఎమ్మెల్యేపై కుల బహిష్కరణ

21వ శతాబ్దంలోనూ కుల జాడ్యం కొనసాగుతోంది. ఇందుకు సామాన్యులే కాకుండా ప్రజాప్రతినిధులూ బలవుతున్నారు. తాజాగా ఒడిశాలో వేరే సామాజికవర్గం యువకుడితో కూతురి నిశ్చితార్థం చేసిన నవరంగపూర్ EX MLA సదాశివ ప్రధాన్ కుల బహిష్కరణకు గురయ్యారు. ఆయన కుటుంబాన్ని 12ఏళ్లపాటు వెలివేస్తున్నట్లు ఆల్ ఇండియా భత్రా డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రకటించింది. సామాజిక, సాంస్కృతిక, ఇతర ఫ్యామిలీ వేడుకల్లో ఎవరూ పాల్గొనవద్దని ఆదేశించింది.
News March 23, 2026
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కారణాలివే!

తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ స్కిన్ లెస్ రేటు రూ.370-400కు చేరింది. వాతావరణంలో అనూహ్య మార్పుల (ఎండలు+వర్షాలు) వల్ల పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కోడి సగటున 3 కేజీల వరకు పెరిగేదని, ప్రస్తుతం కిలోన్నర మాత్రమే ఉంటోందని పేర్కొంటున్నారు. ఉత్పత్తి పడిపోవడం, వరుస పెళ్లిళ్లు, గ్రామాల్లో ఉత్సవాల కారణంగా డిమాండ్ పెరగడం వల్ల రేటు అధికమైందంటున్నారు.


