News September 2, 2024
ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న జగన్

AP: కుండపోత వర్షాలు, వరదలతో విజయవాడ అతలాకుతలమైన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ చీఫ్ జగన్ కాసేపట్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు. తొలుత ఆయన సింగ్ నగర్లో పర్యటిస్తారని సమాచారం. అటు వరద ఉద్ధృతిపై కూటమి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని వైసీపీ ఆరోపించింది.
Similar News
News November 10, 2025
అత్యాచార బాధితురాలిపై లాయర్ ఘాతుకం

గ్యాంగ్ రేప్ బాధితురాలిపై అత్యాచారం చేశాడో లాయర్. UPలోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. 2022లో జరిగిన గ్యాంగ్రేప్ కేసును కోర్టు బయట సెటిల్ చేస్తానని నిందితుల్లో ఒకరి లాయర్ జితేంద్ర సింగ్ యువతి(24)ని నమ్మించాడు. హోటల్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడి నుంచి విడిపించుకుని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతడు ఇంటిపై నుంచి దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి.
News November 10, 2025
NSUTలో 176 పోస్టులు.. అప్లై చేశారా?

ఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (<
News November 10, 2025
పిల్లలతో వ్యాయామం చేయిస్తున్నారా?

వ్యాయామం చేయడం పిల్లలకూ అవసరమేనంటున్నారు నిపుణులు. ఎదిగే వయసులో కండరాలు, ఎముకలు బలపడటానికి వ్యాయామం తోడ్పడుతుంది. ముఖ్యంగా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచే వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్ వారానికి కనీసం మూడు రోజుల పాటైనా చేసేలా చూసుకోవాలి. 3-5 ఏళ్ల పిల్లలనైతే రోజంతా చురుకుగా కదిలేలా, రకరకాల ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.


