News September 10, 2024

రేపు నందిగం సురేశ్‌ను పరామర్శించనున్న జగన్

image

AP: మాజీ సీఎం జగన్‌ రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ‘ఉ.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు సబ్‌ జైలుకు చేరుకుంటారు. అక్కడ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శిస్తారు. అనంతరం ఎస్‌వీఎన్‌ కాలనీలో క్రోసూరు మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఛైర్మన్‌ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళతారు. ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను పరామర్శిస్తారు’ అని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది.

Similar News

News November 18, 2025

రెండు రోజులు జాగ్రత్త!

image

TG: రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది. ఉదయం 9 గంటలైనా తీవ్రత తగ్గడం లేదు.

మూవీ ముచ్చట్లు

image

*కల్ట్ క్లాసిక్ సినిమా ‘షోలే’ డిసెంబర్ 12న థియేటర్లలో రీరిలీజ్‌ కానుంది.
*మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. పూజా కార్యక్రమంతో హారర్ చిత్రం ప్రారంభం. సమర్పకుడిగా వ్యవహరించనున్న నీల్.
* ‘వారణాసి’ వీడియోకు అద్భుత స్పందన రావడంతో సాంకేతిక బృందానికి థాంక్స్ చెప్పిన రాజమౌళి. ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ ట్వీట్.