News February 19, 2025
జగన్కు ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు: కేంద్ర మంత్రి పెమ్మసాని

AP: వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్కు ఆ 11 సీట్లు కూడా రావని, ఒక్క సీటుకే పరిమితమవుతారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ‘జగన్ భాష, వ్యవహారంతో వైసీపీకి కష్టాలు తప్పవు. ఆయన హయాంలో YCP నేతలతో చేయకూడని పనులు చేయించారు. వాటిపైనే ఇప్పుడు వారిపై కేసులు పెడుతున్నారు. ఇందులో తప్పేముంది? రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సీఎం చంద్రబాబు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 21, 2025
YS జగన్కు కేంద్ర బలగాలతో రక్షణ ఇవ్వండి.. PMకు మిథున్ లేఖ

AP: మాజీ సీఎం జగన్కు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రధాని, హోంమంత్రికి వైసీసీ లోక్సభ పక్షనేత మిథున్రెడ్డి లేఖ రాశారు. జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల గుంటూరు పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం తలెత్తిందని, ఆయన నివాసం వద్ద కూడా కొన్ని అనుమానాస్పద ఘటనలు జరిగాయన్నారు. వెంటనే ఆయనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు.
News February 21, 2025
‘విదేశీ వైద్యవిద్యకు NEET-UG అర్హత’ నిబంధన సరైనదే: సుప్రీం

విదేశాల్లో వైద్య విద్య అభ్యసించడానికి ముందుగా నీట్ యూజీలో అర్హత సాధించాలన్న నిబంధన సరైనదేనని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 2018లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఈ నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిబంధనను మార్చాలంటూ పలువురు విద్యార్థులు చేసిన విజ్ఞప్తులను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం ఆ నిబంధనను అమలు చేసే అధికారం MCIకి ఉందని స్పష్టం చేసింది.
News February 21, 2025
సాత్విక్ సాయిరాజ్ తండ్రి గుండెపోటుతో మృతి

AP: స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ ఇంట్లో విషాదం నెలకొంది. కొడుకుకు ‘ఖేల్రత్న’ చూసి మురిసిపోవాల్సిన తండ్రి కాశీ విశ్వనాథం(65) గుండెపోటుతో చనిపోయారు. ఢిల్లీలో అవార్డు ప్రదానోత్సవం కోసం నిన్న అమలాపురం నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకు వెళ్తుండగా ఆయన కుప్పకూలారు. USలో ఉన్న సాత్విక్ సోదరుడు వచ్చాక అంత్యక్రియలు చేస్తారు. 2023కు గాను సాత్విక్ ఖేల్రత్నకు ఎంపికవగా పలుకారణాలతో అప్పుడు తీసుకోలేదు.