News August 20, 2024

వెలిగొండ ప్రాజెక్టుని అడ్డుకుంది జగనే: మంత్రి గొట్టిపాటి

image

AP: వెలిగొండ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకుంది మాజీ సీఎం జగనే అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. గతంలో ప్రకాశం జిల్లా TDP నేతలంతా ఈ ప్రాజెక్టు కోసం కేంద్రమంత్రిని కలిసినట్లు గుర్తు చేశారు. TG మాజీ సీఎం KCRతో కుమ్మక్కై ఏపీ ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. జగన్ కొన్నేళ్ల పాటు నోరు తెరవకపోవడం మంచిదని, లేకుంటే ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని మండిపడ్డారు.

Similar News

News January 15, 2025

ఫిబ్రవరి నుంచి KF బీర్లు బంద్

image

వచ్చే నెల నుంచి తెలంగాణలో వైన్స్‌లు, బార్లలో KF బీర్లు లభించకపోవచ్చు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ ఆ బ్రాండ్ బీర్లు తయారుచేసే యునైటెడ్ బ్రూవరీ(UB) సంస్థ మద్యం సరఫరా నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న స్టాక్ ఈనెలాఖరు వరకే వస్తుందని దుకాణదారులు చెబుతున్నారు. ఆ తర్వాత వైన్స్ వద్ద కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండవు. మరోవైపు లిక్కర్ సరఫరాపై UB కంపెనీతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

News January 15, 2025

రేపు ఈడీ విచారణకు కేటీఆర్

image

TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉ.10.30 గంటలకు కేటీఆర్ హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌కు వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారించారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం తోసిపుచ్చింది. దీంతో ఆయన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

News January 15, 2025

దేశంలో ఎన్నో స‌మ‌స్య‌లుంటే.. సైకిల్ ట్రాక్‌లు కావాలా?: సుప్రీంకోర్టు

image

‘దేశంలో పేద‌ల‌కు స‌రైన నివాస వ‌స‌తి లేదు. మురికివాడ‌ల్లో నివ‌సిస్తున్నారు. విద్యా, ఆరోగ్య సేవ‌ల కొర‌త ఉంది. ప్ర‌భుత్వాలు వీటి కోసం నిధులు ఖ‌ర్చు చేయాలా? లేక సైకిల్ ట్రాక్‌ల కోసమా?’ అని SC ప్ర‌శ్నించింది. దేశ‌ంలో సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటుకు ఆదేశాలివ్వాల‌న్న పిటిష‌న్ విచార‌ణలో కోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది. పిటిషనర్ కాలుష్యం వంటి కారణాలు వివరించగా, ఇలాంటి ఆదేశాలు తామెలా ఇస్తామ‌ని SC ప్ర‌శ్నించింది.