News October 25, 2024
అందుకు జగన్ అరాచక పాలనే కారణం: మంత్రి
AP: కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మాలని జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ‘YCP హయాంలో మహిళలపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోలేదు. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో అత్యాచారం జరిగితే నిందితుడ్ని అరెస్ట్ చేయలేదు. గత ఐదేళ్లలో యువతను గంజాయికి, డ్రగ్స్‌కి బానిసలు చేశారు. ఆ ప్రభావంతోనే సైకోలుగా మారిన కొందరు మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు’ అని దుయ్యబట్టారు.
Similar News
News January 18, 2025
బీదర్, అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పురోగతి
బీదర్‌లో <<15169507>>ఏటీఎం డబ్బులు<<>> చోరీ చేసి, HYD అఫ్జల్‌గంజ్‌లో <<15172705>>కాల్పులు జరిపిన<<>> నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. బిహార్‌కు చెందిన మనీశ్, మరికొందరు కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని ఓ బ్యాంకులో రూ.70లక్షలు చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. మనీశ్, అతని ముఠా కోసం తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ పోలీసులు గాలిస్తున్నారు.
News January 18, 2025
దొంగతనం చేయలేదు: కరీనా కపూర్
సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ఆయన భార్య కరీనా కపూర్ స్టేట్మెంట్ను ముంబై పోలీసులు నమోదు చేశారు. దుండగుడు సైఫ్‌ను చాలా సార్లు పొడిచాడని ఆమె తెలిపారు. తమ కుమారుడు జహంగీర్ వద్దకు వెళ్లేందుకు పదే పదే ప్రయత్నించాడని, సైఫ్ అడ్డుకున్నారని పేర్కొన్నారు. కానీ ఇంట్లో ఎలాంటి డబ్బులు, ఆభరణాలు దొంగతనం చేయలేదని పోలీసులకు వెల్లడించారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News January 18, 2025
డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
AP: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రాజెక్టు సీఈ, అధికారులు భూమిపూజ, హోమం నిర్వహించారు. అనంతరం వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.990 కోట్లు ఖర్చు చేయనుంది. సగం నిర్మాణం పూర్తి కాగానే దానిపై సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించనున్నారు.