News December 14, 2024
జగన్ బర్త్‌డే.. శ్రేణులకు వైసీపీ పిలుపు

AP: వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజైన డిసెంబర్ 21న సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైసీపీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ఎమ్మెల్యేలు, పార్టీ కో-ఆర్డినేటర్లు సమన్వయం చేసుకుంటూ జగన్ పుట్టినరోజు వేడుకలను అందరూ ఘనంగా నిర్వహించాలని నిర్దేశించింది.
Similar News
News December 1, 2025
ఏకమైన తండావాసులు.. ‘ఏకగ్రీవం’ చేశారు!

కోనరావుపేట మండలం కమ్మరిపేట తండా ప్రజలంతా ఏకమై పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేశారు. 232మంది ఓటర్లు ఉన్న ఈ తండాను ST మహిళకు రిజర్వ్ చేయగా, భూక్యా మంజుల-రాజు ఒక్కరే సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. మొత్తం 4 వార్డులు ఉండగా 1వ వార్డుకు భూక్య లక్ష్మి, 2వ వార్డుకు మాలోత్ లక్ష్మి, 3వ వార్డు మాలోత్ తిరుపతి, 4వ వార్డుకు భూక్యా చంద్రకళ మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయింది.
News December 1, 2025
ఫలించిన చర్చలు… పత్తి కొనుగోళ్లు ఆరంభం

TG: పత్తి కొనుగోళ్లపై కేంద్ర మంత్రులు, CCIతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు ఫలించాయి. నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లో కొత్త నిబంధనలతో కొనుగోళ్లకు అనుమతులు లభించక మిల్లర్లు సమ్మెకు దిగారు. ప్రస్తుతం సమస్య పరిష్కారమవ్వడంతో సమ్మె విరమించారు. దీంతో రాష్ట్రంలోని 330 మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ఆరంభమయ్యాయి. ఇప్పటి వరకు ₹2,904 కోట్ల విలువైన 3.66 లక్షల టన్నుల పత్తిని CCI సేకరించింది.
News December 1, 2025
మా రాజీనామాలను ఆమోదించండి: ఎమ్మెల్సీలు

AP: వైసీపీ, MLC పదవులకు రిజైన్ చేసిన ఆరుగురు నాయకులు ఇవాళ మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుతో సమావేశమయ్యారు. ఎలాంటి ప్రలోభాలకూ గురికాకుండా స్వచ్ఛందంగానే తాము రిజైన్ చేశామని, వాటిని ఆమోదించాలని కోరారు. రాజీనామా వెనక్కు తీసుకునే ఆలోచన ఉందా? అని ఛైర్మన్ అడగగా లేదని తేల్చిచెప్పారు. మోషేన్ రాజును కలిసిన వారిలో పద్మశ్రీ, చక్రవర్తి, మర్రి రాజశేఖర్, వెంకటరమణ, జాకియా, పోతుల సునీత ఉన్నారు.


