News April 25, 2024

ముగిసిన జగన్ బస్సు యాత్ర

image

AP: సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగిసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చివరి సిద్ధం సభతో ఈ యాత్ర ముగిసింది. మొత్తం 22 రోజులపాటు 86 నియోజకవర్గాల మీదుగా 2,100 కి.మీ మేర యాత్ర సాగింది. 16 బహిరంగసభలు, 9 రోడ్ షోలు, 6 ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కాగా రేపు పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్ నామినేషన్ వేయనున్నారు.

Similar News

News March 4, 2026

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

image

సౌత్ ఇండియన్ బ్యాంక్‌ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. VAPT, ITGC ఆడిటర్, RED టీమ్ లీడ్ పోస్టులు ఉన్నాయి. BSc, BTech/BE అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ప్రిలిమినరీ/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: recruit.southindianbank.bank.in

News March 4, 2026

వరుసగా విఫలం.. అయినా నం.1 గానే అభిషేక్!

image

T20ల్లో ఇటీవల వరుసగా <<19276161>>విఫలమవుతున్నా<<>> తన నం.1 ర్యాంకును అభిషేక్ శర్మ నిలబెట్టుకున్నారు. 874Ptsతో తొలిస్థానంలో ఉన్నారు. అయితే పాక్ బ్యాటర్ ఫర్హాన్(848) నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ODIల్లో మిచెల్, కోహ్లీ, జద్రాన్, రోహిత్, గిల్ టాప్-5లో ఉన్నారు. బౌలింగ్‌లో టెస్టుల్లో బుమ్రా, T20ల్లో వరుణ్, ODIల్లో రషీద్ ఖాన్ టాప్‌లో ఉన్నారు. టీమ్ ర్యాంకుల్లో ODIలు, T20ల్లో ఫస్ట్, టెస్టుల్లో 4వ ప్లేస్‌లో ఇండియా ఉంది.

News March 4, 2026

సుప్రీంలీడర్‌ నియామకంపై వార్తలు.. స్పందించిన ఇరాన్

image

ఖమేనీ రెండో కొడుకు మొజ్తాబా ఖమేనీ <<19292894>>సుప్రీంలీడర్‌గా<<>> ఎన్నికైనట్లు వస్తున్న వార్తలను ఇరాన్ ఖండించింది. అందులో నిజం లేదని చెప్పింది. ‘ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఎంపిక చేసిన అభ్యర్థుల గురించి మీడియాలో వస్తున్న రిపోర్టులకు అధికారిక ఆధారాలు లేవు. వాటిని తిరస్కరిస్తున్నాం’ అని ముంబైలోని కాన్సులేట్ జనరల్ స్పష్టం చేసింది. మొజ్తాబాను సుప్రీం లీడర్‌గా ప్రకటించనున్నారని ఇజ్రాయెల్ మీడియా చెప్పింది.