News February 7, 2025

జగన్ ‘క్యారెక్టర్’ కామెంట్స్.. స్పందించిన VSR

image

AP: రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం అంటూ YS జగన్ చేసిన <<15377485>>వ్యాఖ్యలపై<<>> మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ‘వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదులుకున్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 5, 2025

కేసీఆర్‌ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు: కిషన్ రెడ్డి

image

TG: కాళేశ్వరంలో అవినీతికి కేసీఆర్‌ను PM మోదీ ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలంటూ సీఎం రేవంత్ చేసిన <<18200152>>వ్యాఖ్యలకు<<>> కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. తాము ఎవరినీ జైలులో వేయమని, కోర్టులు వేస్తాయని తెలిపారు. KCRను జైలులో వేస్తామని తాము చెప్పలేదన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం NDSA నివేదికపై మాత్రమే సీబీఐ విచారణ కోరింది. గవర్నర్ తన అధికారాలను స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు’ అని స్పష్టం చేశారు.

News November 5, 2025

వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

image

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.

News November 5, 2025

ప్రెగ్నెన్సీ రావాలంటే వాటికి దూరంగా ఉండండి

image

చాలా మంది అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు పిల్స్‌ వాడుతుంటారు. కానీ ఇవి తరువాతి కాలంలోనూ ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేయడానికి కనీసం రెండేళ్ల ముందు నుంచి, అలా వీలుకాకపోతే కనీసం 6 నెలలు ముందు నుంచి గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. వీటితో పాటు దంపతులు ఆల్కహాల్‌, పొగాకు ఉత్పత్తుల్ని మానేయాలని సూచిస్తున్నారు. <<-se>>#Pregnancycare<<>>