News July 25, 2024

ఏపీకి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర: హోం మంత్రి

image

APలో ఇప్పటికీ TDP కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అసెంబ్లీలో హోంమంత్రి అనిత అన్నారు. ‘రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని ఢిల్లీలో చెప్పిన జగన్ మృతుల పేర్లను మాత్రం చెప్పలేకపోయారు. అసెంబ్లీకి వచ్చి ఆ పేర్లు చెప్పే దమ్ము జగన్‌కు లేదా? APకి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర చేస్తున్నారు. హత్యలపై వివరాలందిస్తే తగిన విచారణ చేయిస్తాం. తప్పుడు వివరాలిచ్చినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.

Similar News

News December 4, 2025

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి గురువారం ఆలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణోత్సవాలను విజయవంతం చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News December 4, 2025

సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

image

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్‌గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.

News December 4, 2025

కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకూ నెలసరి సెలవులు

image

ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకూ నెలసరి సెలవులను(ఏడాదికి 12) వర్తింపజేస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనంగా 1.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రైవేట్ రంగాల్లోని మహిళలకు(18-52 ఏళ్లు) పెయిడ్ లీవ్‌ను తప్పనిసరి చేస్తూ గత నెల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కాగా బిహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు, కేరళలో యూనివర్సిటీ సిబ్బందికి నెలసరి సెలవులు ఇస్తున్నాయి.