News April 18, 2024
‘సిద్ధం’ పేరుతో జగన్ డ్రామాలు: షర్మిల

AP: సీఎంగా జగన్ మనకు అవసరమా అని PCC చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ‘పెద్ద కోటల్లో నివసించే జగన్.. ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు సిద్ధం పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. వైఎస్ఆర్ హయాంలో ప్రజాదర్బార్ ఉండేది. జగన్ పాలనలో ఎందుకు లేదు? సొంత ప్రయోజనాల కోసం జగన్ కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించండి’ అని ఆమె కోరారు.
Similar News
News October 16, 2025
నేడు ఈశాన్య రుతుపవనాల ఆగమనం

ఇవాళ దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు IMD పేర్కొంది. ఇదే రోజు నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు APలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA పేర్కొంది. ఈ నెల 20కల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD అంచనా వేసింది. అది వాయుగుండం లేదా తుఫానుగా మారే ప్రమాదముందని హెచ్చరించింది.
News October 16, 2025
పెళ్లి కాకుండా దత్తత తీసుకోవచ్చా?

హిందూ దత్తత, భరణం చట్టం 1956 ప్రకారం అవివాహిత స్త్రీలు, మానసికస్థితి బావున్నవారు, మేజర్లు, పెళ్లయినా భర్త వదిలేసినవాళ్లు లేదా భర్త చనిపోయినవాళ్లు, భర్త ఏడేళ్లకు పైగా కనిపించకుండా పోయినవాళ్లు, భర్తకు మతిస్థిమితం లేదని కోర్టు ద్వారా నిరూపితమైన సందర్భాల్లో స్త్రీలు దత్తత తీసుకోవడానికి అర్హులు. సెక్షన్-11 ప్రకారం అబ్బాయిని దత్తత తీసుకోవాలంటే మీకు పిల్లాడికి మధ్య 21 ఏళ్లు తేడా ఉండాలి.
News October 16, 2025
ఫెడరల్ బ్యాంక్లో ఉద్యోగాలు

ఫెడరల్ బ్యాంక్ సేల్స్& క్లయింట్ అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లలోపు ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.800, ST,SCలకు రూ.160. రాత పరీక్ష నవంబర్ 16న నిర్వహిస్తారు. వెబ్సైట్:https://www.federalbank.co.in/