News May 4, 2024
పట్టాదారు పుస్తకాలపై జగన్ బొమ్మ.. సజ్జల రియాక్షన్

AP: భవిష్యత్తులో పాస్ పుస్తకాలకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగకుండా వాటిని రూపొందించామని సజ్జల తెలిపారు. ‘క్యూఆర్ కోడ్ ముద్రించి భూహక్కుదారుల పూర్తి వివరాలను డిజిటలైజ్ చేశాం. రెవెన్యూ శాఖలో ఇలాంటి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన CM జగన్ ఫొటో ముద్రించడంలో తప్పేముంది. గతంలో ప్రతిదానిపై తన ఫొటోలు వేసుకున్న CBNకు ప్రశ్నించే అర్హత ఉందా? ప్రజలెవ్వరికీ లేని అభ్యంతరం బాబుకి ఎందుకు?’ అని మండిపడ్డారు.
Similar News
News November 9, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
* తాడిపత్రిలో బాలిక యశస్వి భారతి(9) 6ని.ల 9సెకన్లలో 100 ట్యూబ్లైట్లను తలపై పగలగొట్టించుకుంది. వరల్డ్ రికార్డ్స్లో స్థానం కోసం ఈ సాహసం చేసింది.
* ఒకప్పుడు గిరిజన గ్రామాలంటే డోలీ మోతలని, ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా మారాయని మంత్రి సంధ్యారాణి చెప్పారు.
News November 9, 2025
చిరంజీవికి థాంక్స్.. అలాగే క్షమాపణలు: RGV

కల్ట్ మూవీ ‘శివ’ ఈనెల 14న రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. ‘చిరంజీవికి ధన్యవాదాలు. నేను మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి మరోసారి థాంక్స్’ అని ట్వీట్ చేశారు.
News November 9, 2025
ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

<


