News June 25, 2024

పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ తీసేస్తా: చంద్రబాబు

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములను కొట్టేసే కుట్ర అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ‘ఆ యాక్ట్ సరైనది కాదని దాన్ని రద్దు చేశాం. మీరు కష్టపడి సంపాదించుకున్న భూమికి చెందిన పట్టా పాసు పుస్తకంపై జగన్ బొమ్మ వేసుకున్నారు. త్వరలోనే వాటిపై జగన్ బొమ్మ తీసేస్తా. రాజముద్రతో కొత్త పుస్తకాలు ముద్రించి ఇస్తా’ అని కుప్పం సభలో CM ప్రకటించారు.

Similar News

News December 29, 2025

సిరిసిల్ల జిల్లాలో రెండు మునిసిపాలిటీలు.. వివరాలివే!

image

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో 2011 జనాభా గణాంకాల ప్రకారం 1,35,711 జనాభా ఉండగా, ఇందులో 12,891 మంది ఎస్సీలు, 1,557 మంది ఎస్టీలు ఉన్నారు. 2020 మునిసిపల్ ఎన్నికల రికార్డుల ప్రకారం రెండు మున్సిపాలిటీలో కలిపి 69 వార్డులలో 1,10,625 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో యువ ఓటర్ల నమోదు జరిగిన నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను జనవరి 10వ తేదీన ప్రకటించనున్నారు

News December 29, 2025

మరోసారి ‘ఇండిగో’ విమానాల రద్దు

image

దేశవ్యాప్తంగా ఇవాళ 118 విమానాలను రద్దు చేసినట్లు ‘ఇండిగో’ తెలిపింది. ప్రతికూల వాతావరణం, ఇతర సమస్యలతో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు పేర్కొంది. వీటిలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలున్నాయి. కాగా ఇటీవల ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డ విషయం తెలిసిందే.

News December 29, 2025

జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు

image

TG: జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని BAC మీటింగ్‌లో నిర్ణయించారు. 4న ఆదివారం సెలవు ఉండనుంది. దీంతో కొత్త సంవత్సరంలో 5 రోజులు సమావేశాలు జరగనున్నాయి. అయితే, 15 రోజులు అసెంబ్లీని నిర్వహించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలు పక్కదారిపట్టేలా BRS, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని BJP రాష్ట్రాధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. INC హామీలపై చర్చ జరగాలన్నారు.