News April 7, 2024

ఆ జాబితాలో జగన్‌ది మొదటి స్థానం: లోకేశ్

image

AP: సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని సీఎంల జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి అప్పులకుప్పగా మార్చారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ అందిస్తామని తెలిపారు.

Similar News

News December 17, 2025

పొలం గట్లపై బంతి మొక్కలను పెంచితే?

image

పొలం గట్లపై బంతి మొక్కలను పెంచడం వల్ల అనేక లాభాలున్నాయి. బంతి పువ్వులు బయట నుంచి వచ్చే హానికర పురుగులను ఆకర్షించి.. గట్టు పక్కన ఉన్న ప్రధాన పంటకు చీడల ముప్పును తగ్గిస్తాయి. బంతి పూలు తేనెటీగలు, ఇతర కీటకాలను ఆకర్షించడం వల్ల పరాగ సంపర్కం జరిగి పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఈ పువ్వులను మన సొంత అవసరాలకు వాడుకోవచ్చు, అలాగే ఎక్కువ పూలు వస్తే అమ్మి కొంత మొత్తం ఆదాయంగా పొందవచ్చు.

News December 17, 2025

ఎత్తుపడిన గొడ్డు పులికి జడుస్తుందా?

image

ముసలిదైపోయి, నీరసించి, ఇక చావుకు దగ్గరగా ఉన్న పశువు తన ముందుకు పులి వచ్చినా భయపడదు. ఎందుకంటే అది ఇప్పటికే చావు అంచుల్లో ఉంది, కాబట్టి కొత్తగా వచ్చే ప్రాణాపాయానికి అది ఆందోళన చెందదు. అలాగే జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, కష్టాల చివరన ఉన్న వ్యక్తిని ఎవరైనా భయపెట్టాలని చూస్తే అతడు అస్సలు భయపడడు. “పోయేదేముంది?” అనే తెగింపు వచ్చినప్పుడు మనిషికి దేనికీ జంకడు అని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

News December 17, 2025

T20 సిరీస్ పట్టేస్తారా?

image

SAతో ఇవాళ IND నాలుగో T20 ఆడనుంది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న IND సిరీస్ పట్టేయాలని చూస్తోంది. అటు చివరి T20 వరకు సిరీస్ విజేతను వాయిదా వేయాలని SA బరిలోకి దిగనుంది. గత 20+ మ్యాచులుగా విఫలమవుతున్న సూర్య ఫామ్ అందుకుంటారా? లేదా? అని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గిల్ సైతం రన్స్ చేయాల్సి ఉంది. లక్నో వేదికగా 7PMకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక్కడి ఎకానా స్టేడియంలో ఆడిన 3 T20ల్లోనూ IND గెలిచింది.