News November 7, 2024

పోటీ చేయలేక పారిపోయిన జగన్ ముఠా: TDP

image

AP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోమని వైసీపీ నేత <<14551662>>పేర్ని నాని ప్రకటించడంపై<<>> టీడీపీ వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి జగన్ రెడ్డి ముఠా పారిపోయిందని ట్వీట్ చేసింది. ఈవీఎంలపై నమ్మకం లేదని చెప్పి, బ్యాలెట్ ద్వారా జరుగుతున్నా పారిపోతున్నారని దుయ్యబట్టింది. ఎలాగూ ఓట్లు రావనే జగన్ రెడ్డి డిసైడ్ అయ్యి పోటీ చేయట్లేదని పేర్కొంది.

Similar News

News January 24, 2026

ఉగ్ర కుట్ర భగ్నం.. 2.5 కిలోల RDX స్వాధీనం!

image

రిపబ్లిక్ డే లక్ష్యంగా ఉగ్రదాడి కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. హొషియార్‌పూర్‌లో నలుగురు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) టెర్రరిస్టులను అరెస్టు చేశారు. 2.5 కిలోల RDX, 2 పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. అమెరికాకు చెందిన హ్యాండ్లర్ల ద్వారా ఈ ముఠా ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. గణతంత్ర వేడుకల్లో దాడులకు ప్లాన్ చేశారన్న సమాచారంతో సోదాలు చేసినట్లు చెప్పారు.

News January 24, 2026

బడ్జెట్ 2026: పాత పన్ను విధానానికి కాలం చెల్లినట్లేనా?

image

బడ్జెట్ 2026లో పాత ఆదాయపు పన్ను విధానాన్ని రద్దు చేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే 72% మంది ట్యాక్స్ పేయర్స్ కొత్త విధానానికే మొగ్గు చూపుతున్నారు. పాత దాంట్లో పెట్టుబడుల లెక్కలు చూపడం, తనిఖీలు, నోటీసులు ఎదుర్కోవడం కష్టమవుతుండటంతో.. ప్రభుత్వం దీన్ని రద్దు చేయొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఒక్కసారిగా కాకుండా కొంత గడువు ఇచ్చి తీసేయొచ్చని భావిస్తున్నారు.

News January 24, 2026

ట్రంప్ చేతికి గాయం.. అసలేమైంది?

image

చేతికి గాయంతో ట్రంప్ కనిపించడం చర్చనీయాంశమవుతోంది. 2 రోజుల కిందట దావోస్‌లో గాజా శాంతి మండలిని ట్రంప్ ప్రారంభించారు. అప్పుడు ఆయన చేతిపై గాయం కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి. దీనిపై మీడియా ప్రశ్నించగా.. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నా. టేబుల్ తగలడంతో గాయమైంది. దానికి క్రీమ్ రాశా. <<18737292>>గుండె ఆరోగ్యం<<>> బాగుండాలంటే ఆస్పిరిన్ తీసుకోవాలి. గాయాలు కావద్దనుకుంటే ఆస్పిరిన్ తీసుకోవద్దు’ అని ట్రంప్ అన్నారు.