News August 9, 2024

జగన్ మాస్టర్ ప్లాన్.. విజయం దక్కుతుందా?

image

AP:విశాఖ స్థానిక సంస్థల MLC ఉపఎన్నికను YCP చీఫ్ జగన్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అభ్యర్థి ప్రకటన, YCP ఓటర్లు(MPTC, ZPTC తదితరులు) కూటమి వైపు చూడకుండా క్యాంప్‌కు తరలించడంలో <<13760321>>చాకచక్యంగా<<>> వ్యవహరించారు. బొత్స సత్యనారాయణను గెలిపించేలా అనుసరించాల్సిన వ్యూహంపై రోజూ నేతలకు సూచనలిస్తున్నారు. అటు TDP కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో AUG 30న జరిగే ఎన్నికల్లో గెలుపెవరిదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Similar News

News November 26, 2025

పెద్దపల్లి: జిల్లా కలెక్టర్‌తో రాణి కుముదిని VC

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆమె జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇందులో పాల్గొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, నోటిఫికేషన్ ప్రకటన, టీపోల్ అప్డేట్లు, ఎన్నికల నియమావళి అమలు పటిష్ఠంగా ఉండాలని కమిషనర్ సూచించారు.

News November 26, 2025

iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.

News November 26, 2025

న్యూస్ అప్‌డేట్స్ @4PM

image

*తిరుమల పరకామణి కేసులో ముగిసిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ.. 4 గంటల పాటు ప్రశ్నించిన సీఐడీ అధికారులు
*ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు.. వారిపై రూ.1.19 కోట్ల రివార్డు
*HYD మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన NSN ఇన్ఫోటెక్ కంపెనీ.. 400 మంది నిరుద్యోగుల నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు
*ICC వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి నం.1గా రోహిత్ శర్మ