News November 8, 2024
విజయమ్మ, షర్మిలపై జగన్ పిటిషన్.. విచారణ వాయిదా

AP: విజయమ్మ, షర్మిలతో ఆస్తుల వివాదంపై జగన్ దాఖలు చేసిన పిటిషన్పై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో విచారణ జరిగింది. తనకు తెలియకుండా తల్లి, చెల్లి షేర్లు బదిలీ చేసుకున్నారని పిటిషన్లో జగన్ పేర్కొన్నారు. జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ పేరిట షేర్లు కొనసాగేలా చూడాలని కోరారు. కౌంటర్ దాఖలకు విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో విచారణను వచ్చే నెల 13కు ఎన్సీఎల్టీ వాయిదా వేసింది.
Similar News
News December 4, 2025
సిరి ధాన్యాలతో ఆరోగ్యానికి ఎంతో లాభం

చిరు ధాన్యాల సాగు, వినియోగం క్రమంగా పెరుగుతోంది. వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలే దీనికి కారణం. చిరుధాన్యాలను తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ని, BP, షుగర్, గుండె వ్యాధుల ముప్పును తగ్గించి రక్తహీనతను దూరం చేస్తాయి. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు తొందరగా అలసిపోకుండా ఉండేందుకు మిల్లెట్స్ దోహదపడతాయి.
News December 4, 2025
SGB బొనాంజా.. గ్రాముకు రూ.9,859 లాభం

సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందిస్తున్నాయి. 2017 డిసెంబర్ 4న విడుదల చేసిన సిరీస్-X బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,961గా RBI నిర్ణయించింది. తాజాగా ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,820గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,859 లాభం(333%) వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం. ఇటీవల సిరీస్-VI బాండ్లకు ₹9,121 లాభం వచ్చిన విషయం తెలిసిందే.
News December 4, 2025
పుతిన్ పర్యటనతో భారత్కు లాభమేంటి?

* ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ మిస్సైళ్లు, డ్రోన్లను కూల్చడానికి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బాగా ఉపయోగపడ్డాయి. పుతిన్ పర్యటనలో మరిన్ని S-400లతో పాటు S-500 కొనుగోలుకు ఆమోదం లభించనుంది.
* రఫేల్, F-21, F/A-18, యూరో ఫైటర్ టైఫూన్లకు పోటీనిచ్చే Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుపైనా చర్చలు జరుగుతాయి. ఇవి రఫేల్ కంటే తక్కువ ధరకే లభించడం విశేషం.


