News September 24, 2025

ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ పిటిషన్.. నేడు విచారణ

image

AP: తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నేడు విచారించనుంది. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని స్పీకర్ అయ్యన్న, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ముందే నిర్ణయించుకున్నారని జగన్ పేర్కొన్నారు. స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైరం, పక్షపాతం ఉన్నాయని ఆరోపించారు. సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Similar News

News September 24, 2025

రిజర్వేషన్లు ఖరారు.. ఎన్నికల సందడి షురూ!

image

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. వార్డు సభ్యుడి నుంచి ZP స్థానాల వరకు జిల్లాల కలెక్టర్లు రిజర్వేషన్లు రూపొందించారు. ఆయా నివేదికలను ఇవాళ సాయంత్రానికి ప్రభుత్వానికి అందజేస్తారు. వాటి ఆధారంగా సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. అయితే మహిళలకు 50% రిజర్వేషన్లను త్వరలో డ్రా పద్ధతిలో నిర్ణయించనున్నారు.

News September 24, 2025

98 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు

image

IOCL అనుబంధ సంస్థ నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్ 98 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు OCT 10వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్‌లో కనీసం 65% మార్కులతో పాసై ఉండాలి. అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు PG, నెట్/గేట్ అర్హత సాధించాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News September 24, 2025

‘OG’ కోసం ఒక్కరోజు థియేటర్లు ఇచ్చిన ‘మిరాయ్’ మేకర్స్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా రేపు విడుదల కానుంది. కొన్ని చోట్ల ఇవాళ రాత్రి స్పెషల్ షోలున్నాయి. ఈక్రమంలో ‘మిరాయ్’ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు ‘మిరాయ్’ ప్రదర్శించే చాలా థియేటర్లను ‘OG’కి ఇస్తున్నట్లు తెలియజేశారు. పవన్‌పై ఉన్న అభిమానంతోనే ఇలా చేసినట్లు తెలిపారు. ఇక 26వ తేదీన మళ్లీ ఆ థియేటర్లలో ‘మిరాయ్’ ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.140+కోట్ల కలెక్షన్లు రాబట్టింది.