News September 24, 2025
ప్రతిపక్ష నేతగా గుర్తించాలని జగన్ పిటిషన్.. విచారణ వాయిదా

AP: తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది. కాగా ప్రతిపక్ష నేతగా జగన్‌ను గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఫిబ్రవరి 5న రూలింగ్ ఇచ్చారు. ఆ రూలింగ్ చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని జగన్ కోర్టుకు వెళ్లారు.
Similar News
News September 24, 2025
12 రోజుల్లో ₹140 కోట్లకు పైగా కలెక్షన్స్

తేజా సజ్జ హీరోగా నటించిన ‘మిరాయ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. నార్త్ అమెరికా కలెక్షన్స్ $3M (రూ.26కోట్లు)కి చేరువలో ఉన్నట్లు తెలిపింది. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 12న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు.
News September 24, 2025
బతుకమ్మ గిన్నిస్ రికార్డ్ కార్యక్రమం వాయిదా

TG: ఈ నెల 28న గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకలను పర్యాటక శాఖ వాయిదా వేసింది. వర్షాలు కురుస్తాయన్న IMD హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ కార్యక్రమాన్ని ఈనెల 29న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ వేడుకల్లో 50 అడుగులకు పైగా ఎత్తుతో బతుకమ్మను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 10 వేల మంది మహిళలు పాల్గొననున్నారు.
News September 24, 2025
చంద్రబాబు ప్రభుత్వం చేయకూడని పనులన్నీ చేస్తోంది: జగన్

AP: కూటమి ప్రభుత్వంపై 15 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని YCP అధినేత జగన్ అన్నారు. ‘చంద్రబాబు ప్రభుత్వం చేయకూడని పనులన్నీ చేస్తోంది. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయినా బలవంతపు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ స్థాయిలో మోసం చేసేవారు ఎవరూ ఉండరు. YCP హయాంలో ఇలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో యూరియా దొరకట్లేదు. ప్రభుత్వం దళారులతో చేతులు కలిపి యూరియాను పక్కదారి పట్టిస్తోంది’ అని పార్టీ సమావేశంలో ఆరోపించారు.