News February 6, 2025

ఇవాళ జగన్ ప్రెస్ మీట్

image

AP: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 6, 2025

స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్

image

ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్కస్ స్టొయినిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. CTకి 15 మందితో కూడిన జాబితాలో చోటు దక్కించుకున్న అతడు అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 71 వన్డేలు ఆడి 1,495 పరుగులు చేశారు. ఒక సెంచరీతో పాటు 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. మొత్తం 48 వికెట్లు తీశారు.

News February 6, 2025

బీఆర్ఎస్ సర్వేపై సీఐడీ విచారణ చేపట్టాలి: షబ్బీర్ అలీ

image

TG: కులగణన సర్వే నివేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ చేపట్టాలన్నారు. ప్రజల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. సర్వే పేరుతో రూ.100 కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. విచారణ జరిగితే అన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

News February 6, 2025

BREAKING: ఫిరాయింపుల ఎమ్మెల్యేల కీలక నిర్ణయం

image

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ అధ్యక్షతన జరిగే సీఎల్పీ సమావేశానికి హాజరుకావొద్దని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఇదే విషయమై అసెంబ్లీ సెక్రటరీ ఈ ఎమ్మెల్యేలకు నోటిసులు జారీ చేశారు.

error: Content is protected !!