News November 27, 2024

రేపు జగన్ ప్రెస్‌మీట్

image

AP: వైసీపీ అధినేత జగన్ రేపు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సా.4 గంటలకు ఈ సమావేశం ఉంటుందని YCP ట్వీట్ చేసింది. అదానీ వ్యవహారంపై ఆయన ముడుపులు తీసుకున్నట్లు ఇటీవల ఆరోపణలు రావడం, ప్రాసిక్యూషన్ చేస్తారనే ప్రచారం జరుగుతుండటంపై జగన్ స్పందించే అవకాశం ఉంది.

Similar News

News November 22, 2025

‘ఫ్రీ స్కూటీ స్కీమ్’.. PIBFactCheck క్లారిటీ

image

‘ప్రధానమంత్రి ఫ్రీ స్కూటీ స్కీమ్’ పేరుతో SMలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా ఫేక్‌ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇస్తారని వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని PIBFactCheck తేల్చింది. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే సందర్శించాలని పేర్కొంది.

News November 22, 2025

బ్లీచ్‌ చేయించుకుంటున్నారా?

image

చర్మం అందంగా మెరుస్తూ ఉండటంతో పాటు ట్యానింగ్ పోవాలని పార్లర్‌కి వెళ్లి చాలామంది స్కిన్‌కి బ్లీచ్ అప్లై చేయించుకుంటారు. బ్లీచ్‌ను చర్మానికి అప్లై చేసేముందు మాయిశ్చరైజర్ రాసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బ్లీచ్ చేయించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చర్మానికి బ్లీచ్ అప్లై చేయకూడదు.

News November 22, 2025

హిందువులు లేకుంటే ప్రపంచమే లేదు: RSS చీఫ్

image

హిందువులు లేకపోతే ప్రపంచం ఉనికిలోనే ఉండదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘ప్రపంచంలోని ప్రతిదేశం అన్ని రకాల పరిస్థితులను చూసింది. యునాన్(గ్రీస్), మిస్ర్(ఈజిప్ట్), రోమ్, అన్ని నాగరికతలు కనుమరుగయ్యాయి. మన నాగరికతలో ఏదో ఉంది కాబట్టే మనం ఇంకా ఇక్కడున్నాం’ అని చెప్పారు. భారత్ అనేది అంతంలేని నాగరికతకు పేరు అని, హిందూ సమాజం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. మనం ఎవరిపైనా ఆధారపడకూడదని చెప్పారు.