News February 5, 2025

రేపు జగన్ ప్రెస్‌మీట్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రజా సమస్యలపై ఆయన ప్రసంగిస్తారు. కాగా ఇవాళ విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో జగన్ కూటమి సర్కార్‌పై ఫైర్ అయ్యారు. ఈసారి జగనన్న 2.0 వేరే లెవెల్‌లో ఉంటుందని కూటమి సర్కార్‌ను ఆయన హెచ్చరించారు.

Similar News

News January 20, 2026

డిజాస్టర్‌గా ‘రాజాసాబ్’?

image

రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రాజాసాబ్’ థియేట్రికల్ రన్‌ను డిజాస్టర్‌గా ముగించనుంది. JAN 9న విడుదలైన మూవీ 55% వసూళ్లతో బిజినెస్ క్లోజ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు తెలిపాయి. థియేటర్లలో 20% ఆక్యుపెన్సీ కూడా ఉండట్లేదని పేర్కొన్నాయి. బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్‌గా నిలిచేందుకు ఇంకా రూ.90కోట్లు(నెట్) రావాలన్నాయి. మరోవైపు OTT డీల్ ఆశించినంత మేర జరగలేదని ప్రొడ్యూసర్ పేర్కొన్నారని చెప్పాయి.

News January 20, 2026

స్కిప్పింగ్‌తో ఎన్నో లాభాలు

image

ప్రతిరోజు స్కిప్పింగ్​ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు. స్కిప్పింగ్​ చేయడం వల్ల కండరాలు పటిష్ఠడతాయి. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. కాళ్లు, చేతులు, ఇతర అవయవాల మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది. తద్వారా బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువ ఖర్చై బాడీ ఫిట్‌గా మారుతుంది. అంతేకాకుండా స్కిప్పింగ్​ చేయడం ద్వారా డోపమైన్​ ఎక్కువగా రిలీజ్​ అవుతుంది.

News January 20, 2026

72 గంటల్లో లొంగిపోండి.. ఇరాన్ హెచ్చరికలు

image

నిరసనకారులకు ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. 72 గంటల్లోగా లొంగిపోవాలని, లేదంటే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేషనల్ పోలీస్ చీఫ్ అహ్మద్ రెజా హెచ్చరించారు. అల్లర్లలో పాల్గొన్న యువకులను శత్రు సైనికులుగా కాకుండా మోసపోయిన వారిగా పరిగణిస్తామని చెప్పారు. గడువులోగా సరెండర్ అయితే వారిపై దయతో వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. 2 వారాలుగా ఇరాన్‌లో జరుగుతున్న నిరసనల్లో వేలాది మంది చనిపోయిన విషయం తెలిసిందే.