News April 14, 2024
రేపు గుడివాడలో జగన్ బహిరంగ సభ
AP: విజయవాడలో రాయి దాడి ఘటనతో CM జగన్ మేమంతా సిద్ధం యాత్రకు ఇవాళ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా రేపు జగన్ యాత్ర కేసరపల్లి నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 9గంటలకు గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, జొన్నపాడు మీదుగా యాత్ర గుడివాడ చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకుని రాత్రికి అక్కడే జగన్ బస చేస్తారు.
Similar News
News November 17, 2024
ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు
AP: నైరుతి బంగాళాఖాతం నుంచి కొమరిన్ తీరం వరకు ద్రోణి విస్తరించింది. అలాగే బంగాళాఖాతం నుంచి రాయలసీమ, కోస్తా వైపు తూర్పుగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో చలి పెరుగుతోంది. నిన్న కళింగపట్నంలో 20.6డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News November 17, 2024
వచ్చే వారం ‘RC16’ షురూ?
బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటించనున్న ‘RC16’ మూవీ షూటింగ్ వచ్చే వారం ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం మైసూర్‌లో భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని మూవీ వర్గాలు వెల్లడించాయి. క్రీడా నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో నిండిన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు టాక్. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
News November 17, 2024
కులగణన.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
TG: సమగ్ర కులగణనలో సేకరించిన వివరాలను అత్యంత భద్రంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ సర్వేలో సేకరించిన డేటాను ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో ఎంట్రీ చేస్తారు. ఆ డేటా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై బీసీ డెడికేటెడ్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.