News December 6, 2024
జగన్ పాలన.. దళితులకు నరకయాతన: లోకేశ్

AP: గత టీడీపీ హయాం(2014-19)తో పోలిస్తే వైసీపీ పాలనలో దళితులపై దాడులు 10 రెట్లు పెరిగాయని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ‘జగన్ జమానాలో దళితులపై దమనకాండకు ఇవిగో సాక్ష్యాలు. దళితులను చంపి డోర్ డెలివరీ చేశారు. జే బ్రాండ్స్‌పై పోరాడినందుకు హత్యలు చేశారు. ఇసుక అక్రమాలపై నోరెత్తినందుకు శిరోముండనం చేశారు. జగన్ పాపాల చిట్టా రాజ్యసభ సాక్షిగా దేశానికి తెలిసింది’ అంటూ ఆయన Xలో పోస్ట్ చేశారు.
Similar News
News December 31, 2025
వారెన్ బఫెట్ వీడ్కోలు: వ్యాపార దిగ్గజాలు నేర్చుకున్న పాఠాలివే!

బెర్క్‌షైర్ హాత్వే CEOగా వారెన్ బఫెట్ తన సుదీర్ఘ ప్రస్థానాన్ని నేటితో ముగించనున్నారు. 95 ఏళ్ల వయసున్న ఈ పెట్టుబడి దిగ్గజం నుంచి నేర్చుకున్న పాఠాలను వ్యాపారవేత్తలు గుర్తుచేసుకుంటున్నారు. క్లిష్టమైన విషయాలను సరళంగా చెప్పడం, ఓపికతో లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్ చేయడం బఫెట్ ప్రత్యేకత. డబ్బు కంటే నైతికతకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. సంపద మనిషిని బందీ చేయకూడదని నమ్మి.. తన ఆస్తిని దానధర్మాలకు కేటాయించారు.
News December 31, 2025
APPLY NOW: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 18 పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<
News December 31, 2025
శివలింగం ధ్వంసం కేసులో కీలక మలుపు

AP: కోనసీమ జిల్లా ద్రాక్షారామం భీమేశ్వరాలయంలోని కపాలేశ్వర స్వామి <<18714825>>శివలింగం<<>> ధ్వంసం చేసిన ఘటనలో కీలక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. CCTV ఫుటేజ్ ఆధారంగా తోటపేటకు చెందిన ఓ యువకుడిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయ అర్చకుడితో జరిగిన వ్యక్తిగత వివాదం కారణంగానే శివ లింగం ధ్వంసం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం కూడా సీరియస్ అయ్యారు.


