News October 9, 2025

ప్రజలను రెచ్చగొట్టేందుకే జగన్ బలప్రదర్శన: సత్యకుమార్

image

AP: నర్సీపట్నం పర్యటనకు కారణమేంటో వైసీపీ చీఫ్ జగన్ స్పష్టంగా చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు బలప్రదర్శన చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఆయన పర్యటనలు ఎలా సాగాయో చూశామన్నారు. మెడికల్ కాలేజీలపై జగన్‌కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఫైరయ్యారు. వికృత మనస్తత్వం ఉన్న జగన్‌కు ఏపీ అభివృద్ధి ఇష్టం లేదని మంత్రి విమర్శించారు.

Similar News

News October 9, 2025

రోల్డ్‌గోల్డ్ నగలు ఎక్కువకాలం మన్నాలంటే..

image

నగలంటే ప్రతి మహిళకూ ప్రత్యేకమే. కానీ రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలతో నగలు కొనడం కష్టమవుతోంది. దీంతో గిల్టు నగలు కొనడం ఎక్కువైంది. అయితే వీటిని సరిగ్గా సంరక్షించకపోతే త్వరగా పాడైపోతాయి. అందుకే వీటిని నీటికి దూరంగా ఉంచాలి. చర్మంపై మేకప్, మాయిశ్చరైజర్, పర్ఫ్యూమ్‌లు, లోషన్లు, డియోడరెంట్లు వాడే ముందు గిల్టు నగలను తీసేయాలి. వీటి కెమికల్స్ వల్ల వాటి కోటింగ్ పోతుంది. ఎయిర్‌టైట్ పౌచ్‌లో భద్రపరచాలి.

News October 9, 2025

వేరు శనగలో దిగుబడి పెరగాలంటే!

image

వేరు శనగ నాణ్యత, దిగుబడి పెరగడానికి జింక్ చాలా కీలకం. ఈ సూక్ష్మపోషకం తగ్గినప్పుడు మొక్కలో ఎదుగుదల ఉండదు. ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈనెలకు ఇరువైపులా తుప్పురంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వారం వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్‌ను 3 పంటలకొకసారి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.

News October 9, 2025

వెండి ధరకు రెక్కలు.. ఒక్కరోజే రూ.7వేలు హైక్

image

HYD బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర ఇవాళ ఉదయం రూ.1,000, ఇప్పుడు మరో రూ.6వేలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.1,77,000కు చేరింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.9,900 పెరగడం గమనార్హం. ఫ్యూచర్‌లో వెండి ధర ఊహించని విధంగా పెరుగుతుందని ట్రేడ్ నిపుణులు చెబుతుండటంతో ఇన్వెస్టర్లు సిల్వర్‌పై మొగ్గుచూపుతున్నారు. దీంతో భారీగా ధరలు పెరుగుతున్నాయి. ఇలానే కొనసాగితే నెలాఖరుకి రూ.2లక్షలకు చేరే ఛాన్స్ ఉంది.