News October 8, 2025
ఆంక్షలతో జగన్ పర్యటనకు అనుమతి

AP: అనకాపల్లిలో రేపు YCP చీఫ్ జగన్ పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి లభించింది. ఈ విషయాన్ని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత వెల్లడించారు. వైజాగ్ ఎయిర్‌పోర్టు నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్, వేపగుంట, సరిపల్లి జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో రావాలని సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ పర్మిషన్ లేకుండా ఎలాంటి మార్పులు, హాల్ట్ చేయకూడదని పేర్కొన్నారు. జన సమీకరణకు అనుమతి లేదని, ఊరేగింపులు, రోడ్ మార్చ్‌లపై నిషేధం ఉందన్నారు.
Similar News
News December 28, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<
News December 28, 2025
దుర్గగుడిలో పవర్ కట్.. ఏం జరిగిందంటే?

AP: నిన్న విజయవాడ దుర్గగుడిలో 3 గంటల పాటు పవర్ కట్ చేయడం సంచలనంగా మారింది. మూడేళ్లకు కలిపి రూ.4.5 కోట్ల బిల్లులు ఉన్నాయని విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేశారు. అయితే దుర్గామాత ఆలయ భూముల్లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తును 2023 నుంచి విద్యుత్ శాఖకు ఇస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. నెట్ మీటరింగ్ జీరో అవుతుందని, బిల్లులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. ఈ పంచాయితీపై CMO సీరియస్ అయింది.
News December 28, 2025
బంగ్లా ‘యాంటీ ఇండియా’ మంత్రం

బంగ్లాదేశ్‌లో ర్యాడికల్ స్టూడెంట్ లీడర్ హాదీ హత్యను అక్కడి ఇస్లామిస్ట్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. నిరసనలతో దేశాన్ని స్తంభింపజేస్తున్నాయి. భారత్, ప్రధాని మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ‘భారత వ్యతిరేక’ ధోరణి అక్కడ బలమైన శక్తిగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలనుకునే ఏ పార్టీ అయినా ఈ భావోద్వేగాలను విస్మరించలేని పరిస్థితి.


