News June 22, 2024

YCP కార్యాలయాన్ని కూల్చేయడంపై జగన్ ట్వీట్

image

AP: తాడేపల్లిలో YCP కార్యాలయాన్ని కూల్చేయడంపై YS జగన్ స్పందించారు. ‘రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. నియంతలా దాదాపు పూర్తికావొచ్చిన YCP కార్యాలయాన్ని కూల్చేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం కనుమరుగైపోయాయి. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా బాబు దుశ్చర్యలను ఖండించాలి. ఈ బెదిరింపులకు తలొగ్గేది లేదు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 28, 2025

‘రబీలో యూరియా కొరత ఉండకూడదు’

image

AP: ఖరీఫ్‌లో ఎదురైన యూరియా సమస్యలు.. ప్రస్తుత రబీ సీజన్‌లో తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. గ్రోమోర్ కేంద్రాల్లో యూరియా కొరతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.91 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని, పోర్టుల్లో మరో 1.35 లక్షల టన్నులు ఉందని.. దీన్ని అన్ని జిల్లాలకు అవసరం మేరకు తరిలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News November 28, 2025

SNBNCBSలో ఫ్యాకల్టీ పోస్టులు

image

సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ (SNBNCBS) ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ(అప్లైడ్ సైన్స్/ఇంజినీరింగ్)తో పాటు పని అనుభవం ఉండాలి. జీతం అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నెలకు రూ.78,800, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,23,100 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.bose.res.in/

News November 28, 2025

టాక్సిక్ వర్క్ కల్చర్‌లో పనిచేస్తున్నా:గర్భిణి ఆవేదన

image

ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా కొందరు మేనేజర్లు ఇబ్బందిపెడుతుంటారు. అలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్‌లో ఇబ్బందిపడుతున్న 28 వారాల గర్భంతో ఉన్న బ్యాంక్ ఉద్యోగిని చేసిన రెడిట్ పోస్ట్ వైరలవుతోంది. అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యానని,103°F జ్వరంలోనూ మేనేజర్ సెలవు నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లీవ్ అడిగితే ఫోన్ చేసి తిట్టారని ఆమె ఆరోపించారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది.