News September 27, 2024
జగన్ తిరుపతి పర్యటన.. కూటమి కీలక నిర్ణయం

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు తిరుపతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. జగన్ పర్యటనను అడ్డుకోవద్దని నిర్ణయించారు. అయితే లడ్డూ కల్తీకి కారణం జగనే అని, ఆయన వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
Similar News
News December 1, 2025
నేటి నుంచి ప్రజాపాలన ఉత్సవాలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో నేటి నుంచి ఆరు రోజుల పాటు పలు ఉమ్మడి జిల్లాల్లో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించనుంది. ఇవాళ ఉమ్మడి MBNRలోని మక్తల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. CM రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
News December 1, 2025
ఆలోచనలను ఆదాయ వనరుగా మార్చారు

2014లో నాలుగు ఆవుల్ని కొన్న శ్రీకాంత్, చార్మి దంపతులు అహ్మదాబాద్లో వాటిని పెంచుతూ తొలుత పాలు, నెయ్యి, పనీర్ అమ్మారు. ఈ వృత్తినే ఒక ఆదాయ వనరుగా మలచుకోవాలనుకున్నారు. ఆవుల సంఖ్య పెంచి ‘గౌనీతి ఆర్గానిక్’ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. పాలు, నెయ్యి, పన్నీరుతో న్యూట్రి బార్లు, లిప్ బామ్ వంటి ఆర్గానిక్ ఉత్పత్తులను, ఆవు పేడతో తయారు చేసిన ధూపం, అగర్ బత్తి వంటి వాటిని తమ ఇంటి వద్దనే అమ్మడం ప్రారంభించారు.
News December 1, 2025
TCILలో 150 పోస్టులు.. అప్లై చేశారా?

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL)లో 150 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు DEC 9 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్, డాక్యుమెంట్స్ను tcilksa@tcil.net.in, tcilksahr@gmail.comకు ఇ మెయిల్ ద్వారా పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.tcil.net.in/


