News September 12, 2025

మెడికల్ కాలేజీల టెండర్లపై జగన్ వార్నింగ్.. సజ్జల ఏమన్నారంటే?

image

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకూడదనే ఉద్దేశంతోనే జగన్ మెడికల్ కాలేజీల టెండర్లపై హెచ్చరికలు జారీ చేశారని YCP సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘కోర్ సెక్టార్స్‌లో ప్రభుత్వ ప్రాధాన్యం ఉండాలనేదే మా లక్ష్యం. ప్రభుత్వ సంస్థను ప్రైవేటుపరం చేస్తుంటే కచ్చితంగా హెచ్చరిస్తాం’ అని అన్నారు. ఇక తమ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నందుకే కొందరు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 4, 2026

పుట్టిన నగరంలోనే ఖమేనీ ఖననం?

image

ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇరాన్‌‌లోని మషాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఖమేనీ పుట్టినిల్లు అయిన ఈ మషాద్ టెహ్రాన్ తర్వాత ఇరాన్‌లోనే అతిపెద్ద నగరం. ఇక్కడి ప్రఖ్యాత ఇమామ్ రెజా ష్రైన్‌లోనే ఖమేనీ తండ్రి సమాధి ఉంది. ఖమేనీకి సైతం ఇక్కడే అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. కాగా ఈ ఇమామ్ రెజా ష్రైన్‌ షియా ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. ఏటా ఈ ప్రాంతాన్ని 3 కోట్ల మంది సందర్శిస్తారు.

News March 4, 2026

అమెరికా-ఇరాన్ పోరుపై RGV ట్వీట్

image

మిడిల్ఈస్ట్‌ను ఉద్రిక్త పరిస్థితుల్లోకి నెట్టేసిన అమెరికా-ఇరాన్ పోరుపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం జీసస్ – అల్లాకు మధ్య జరుగుతున్న పోరుగా పేర్కొన్న RGV.. ఎవరు గెలిస్తే వారి మతంలోకి మారుతానన్నారు. అమెరికాలో మెజార్టీ క్రిస్టియన్లు ఉండటం, ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ కావడంతో ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరు అన్నట్లుగా వర్మ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

News March 4, 2026

రానున్నాయ్ మహిళా పెట్రోల్ బంకులు

image

TG: ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. ‘ఇందిరా మహిళాశక్తి’ కింద వీటిని నెలకొల్పుతారు. జిల్లా యంత్రాంగం ఈ పెట్రోలు బంకులకు అవసరమైన భూమిని 30 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ ప్రతిపాదనల్ని మెప్మాకు అందించాలి. ALF, TLFలు వీటికి నిధులు సమకూరుస్తాయి. ఆయిల్ కంపెనీలు, లీగల్ మెట్రాలజీ ఇలా వివిధ ప్రొసీజర్లు పూర్తి చేయాలి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని లక్ష్యం.