News September 3, 2024

‘జై హనుమాన్’ నిర్మాత మార్పు?

image

హీరో తేజా సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబోలో ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘హనుమాన్’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ‘జై హనుమాన్’ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, సీక్వెల్‌కి బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి నిర్మాతలు తప్పుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని, 2026లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Similar News

News January 26, 2026

రియల్ హీరో.. ప్రాణాలకు తెగించాడు!

image

ప్రమాదంలో ఉన్నవారిని రక్షించే గుణం చాలా గొప్పది. నాంపల్లి <<18951833>>అగ్నిప్రమాదంలో<<>> చిక్కుకున్న వారిని దినేశ్ అనే వ్యక్తి రక్షించి హీరోగా నిలిచారు. మంటలు ఎగిసిపడుతున్నా ప్రాణాలకు తెగించారు. అంతా వీడియోలు తీస్తుంటే దినేశ్‌తో పాటు మహమ్మద్ జకీర్, కలీం, రహీం, అమర్‌లు సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు HYD CP సజ్జనార్ తెలిపారు. వీరిని గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరించుకోవడం గర్వకారణం అని పేర్కొన్నారు.

News January 26, 2026

ముగిసిన రిపబ్లిక్ డే వేడుకలు

image

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 77వ రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో పరిసరాలు హోరెత్తాయి. అంతకుముందు కీరవాణి కంపోజ్ చేసిన పాటను శ్రేయా ఘోషల్ ఆలపించారు. త్రివిధ దళాలు చేసిన విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. సైన్యం నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి వారికి వీడ్కోలు పలికి అతిథులతో గుర్రపు బగ్గీలో అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు.

News January 26, 2026

మావోల గడ్డపై తొలిసారి గణతంత్ర వేడుకలు

image

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం చరిత్రలో నేడు ఒక మరిచిపోలేని ఘట్టం నమోదైంది. దశాబ్దాల పాటు మావోయిస్టుల ప్రభావంతో జాతీయ పండుగలకు దూరమైన 47 మారుమూల గ్రామాలు తొలిసారి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయి. బీజాపూర్, నారాయణ్‌పూర్, సుక్మా జిల్లాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. రోడ్లు, బ్యాంకులు, పాఠశాలలు అందుబాటులోకి వస్తున్నాయి.