News August 4, 2024
జై జవాన్.. వసతులు లేకున్నా పట్టించుకోలేదు!

కేరళలోని వయనాడ్‌లో జవాన్లు అలసటను లెక్కచేయకుండా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. సేద తీరేందుకు సౌకర్యాలు లేకపోయినా పట్టించుకోకుండా కాస్త విరామం తీసుకుని మళ్లీ సహాయక చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను BJP ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి షేర్ చేశారు. ‘వీళ్లు విశ్రమించేందుకు మంచాలు, ఫ్యాన్లు వంటి సౌకర్యాలు లేవు. అయినా సరే ఎలాంటి కంప్లయింట్స్ లేవు. జై జవాన్’ అని పేర్కొన్నారు.
Similar News
News October 20, 2025
వంటింటి చిట్కాలు

* ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే.. ఉప్పు తేమగా మారదు.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
* కొత్త బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టి వాసన రాదు.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
News October 20, 2025
‘చందన బ్రదర్స్’ అధినేత కన్నుమూత

చందన బ్రదర్స్ వ్యవస్థాపకుడు చందన మోహన్‌రావు(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు. సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు, ఫర్నీచర్, జువెలరీ అందించే లక్ష్యంతో 1971లో చందన బ్రదర్స్ సంస్థను ఆయన ప్రారంభించారు. దూరదృష్టితో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రిటైల్ సంస్థగా నిలిపారు.
News October 20, 2025
DLS కంటే VJD మెథడ్ చాలా బెటర్: గవాస్కర్

IND, AUS మధ్య నిన్న జరిగిన తొలి వన్డేలో DLS మెథడ్‌పై దిగ్గజ క్రికెటర్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఎప్పటి నుంచో ఉన్నా DLS గురించి చాలా మందికి తెలియదు. దీనికి బదులు ఇండియన్ కనిపెట్టిన <<18056102>>VJD<<>> మెథడ్ చాలా బెటర్. ఇరు జట్లకు అనుకూలంగా ఉంటుంది. BCCI డొమెస్టిక్ క్రికెట్లో ఈ పద్ధతిని అనుసరించింది’ అని అన్నారు. కాగా నిన్న IND 26 ఓవర్లలో 136 రన్స్ చేయగా DLS ప్రకారం టార్గెట్‌ను 131కి తగ్గించడం తెలిసిందే.