News August 28, 2024

జై షా గ్రేటెస్ట్ ఆల్‌రౌండ్ క్రికెటర్.. ప్రకాశ్ రాజ్ సెటైర్లు

image

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవడంపై నటుడు ప్రకాశ్ రాజ్ సెటైర్లు వేశారు. ‘గ్రేటెస్ట్ లెజెండ్‌కు అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలి. ఇండియా తయారు చేసిన బ్యాటర్, బౌలర్, వికెట్ కీపర్, ఫీల్డర్.. అత్యుత్తమ ఆల్‌రౌండ్ క్రికెటర్ ఇతడు. ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News March 31, 2026

విద్యార్థి సంఘాలపై నేపాల్ పీఎం బ్యాన్

image

స్టూడెంట్ పాలిటిక్స్‌పై నేపాల్ కొత్త ప్రధాని బాలెన్ షా సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలపై నిషేధం విధించారు. ఆ స్థానంలో స్టూడెంట్ కౌన్సిల్స్ తీసుకొస్తామన్నారు. యూనివర్సిటీల్లో రాజకీయాలకు పనేంటని బాలెన్ షా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జెన్‌జీ నిరసనల్లో చనిపోయిన 27 మంది విద్యార్థుల కుటుంబాల్లో ఒకరికి చొప్పున ఉద్యోగాలు కల్పించారు.

News March 31, 2026

మాడిపోతున్న వేప చెట్లు.. కారణం, నివారణ ఇలా!

image

ఎన్నో ఔషధ గుణాలున్న వేప చెట్లకు పెద్ద కష్టం వచ్చింది. AP, TGలో వేలాది చెట్లు ఎండిపోతున్నాయి. దీనికి ‘డైబ్యాక్’ అనే వ్యాధి కారణమని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీన్ని నివారించడానికి ఆకులపై కాపర్ ఆక్సీక్లోరైడ్ పిచికారీ చేయాలని, చెట్టు మొదలులో వర్మీ కంపోస్ట్ వేయాలని సూచిస్తున్నారు. చెట్లను కాపాడటానికి అధికారులే చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
* మీ ఏరియాలోనూ వేప చెట్లకు ఇలా అవుతోందా?
#ShareIt

News March 31, 2026

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను తగ్గిస్తాం: మంత్రి సత్యకుమార్

image

AP: రాష్ట్రంలో జనాభా స్థిరీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. సంతానోత్పత్తి రేటు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత జనాభా నియంత్రణ విధానానికి స్వస్తి పలికి నూతన ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్న మహిళల శాతం 70గా ఉండగా దానిని 50%కు తగ్గిస్తామన్నారు. కాగా రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5గా ఉంది.