News May 14, 2024
బీజేపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు జైలే: హిమాచల్ సీఎం

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఆరుగురు ఎమ్మెల్యేలకు జైలు తప్పదని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ హెచ్చరించారు. ‘మన దగ్గర మరో మూడున్నరేళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది. 2027లో కూడా గెలుస్తాం. ఆ ఆరుగురు డబ్బుకు అమ్ముడుపోయి పార్టీకి ద్రోహం చేశారు. ఈ ఏడాది జూన్ 1న ప్రజలు అవినీతిపరులకు తగిన గుణపాఠం చెబుతారు’ అని పేర్కొన్నారు. హిమాచల్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది.
Similar News
News March 13, 2026
వారు రక్తదానం చేయడంపై నిషేధం కొనసాగుతుంది: కేంద్రం

ట్రాన్స్‌జెండర్లు, పురుషులతో లైంగిక సంబంధం ఉన్న పురుషులు, సెక్స్ వర్కర్ల రక్తదానంపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. HIV, హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిబంధనలు అవసరమని తెలిపింది. ఇది వివక్ష కాదని స్పష్టం చేసింది. కేవలం లైంగిక గుర్తింపు ఆధారంగా రక్తదానాన్ని నిరాకరించడం చట్టవిరుద్ధమని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో కేంద్రం వివరణ ఇచ్చింది.
News March 13, 2026
ఫ్లాష్ ఫ్లడ్స్‌ను 24hrs ముందే అంచనా వేయొచ్చు: పిచాయ్

పట్టణాల్లో ఆకస్మిక వరదలను 24hrs ముందే అంచనా వేసే ‘గ్రౌండ్ సోర్స్’ అనే కొత్త AI మోడల్‌ను రూపొందించినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. ‘జెమినీ’ సాయంతో ఇది 150+ దేశాల్లో 26లక్షల వరద సంఘటనలను విశ్లేషించిందని తెలిపారు. శాస్త్రవేత్తల పరిశోధనలు, ప్రజల సేఫ్టీ కోసం ఈ డేటాను గూగుల్ <
News March 13, 2026
సీక్వెల్ సినిమాకి డైరెక్టర్‌గా బోయపాటి?

‘అఖండ-2’ తర్వాత బోయపాటి శ్రీను చేసే తర్వాత సినిమా ఏంటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. సన్నీ డియోల్‌తో ‘జాట్-2’ డైరెక్ట్ చేయమని ఆయన్ను మైత్రీ సంస్థ సంప్రదించినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘జాట్’కు ఇది సీక్వెల్‌గా రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఆఫర్‌ను తీసుకుంటారా? వదులుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.


