News June 12, 2024
కువైట్ అగ్నిప్రమాదంపై స్పందించిన జైశంకర్

కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 41 మంది మరణించారని, 50 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారని కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు. ‘ప్రమాద స్థలానికి భారత రాయబారి వెళ్లారు. మరింత సమాచారం రావాల్సి ఉంది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికీ ఎంబసీ సహాయం చేస్తుంది’ అని X వేదికగా తెలియజేశారు.
Similar News
News January 17, 2026
రక్తపాతానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణం: ఖమేనీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్రిమినల్ అని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫైరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ట్రంప్ హస్తం ఉందని ఆరోపించారు. ‘దేశంలో జరుగుతున్న విధ్వంసానికి, రక్తపాతానికి విదేశీయులే కారణం. అమెరికా, ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న వారు భారీ నష్టాన్ని కలిగించి, వేలాది మందిని చంపారు. దేశాన్ని యుద్ధంలోకి లాగబోం. అలానే స్థానిక, అంతర్జాతీయ నేరస్థులను శిక్షించకుండా వదలబోం’ అని స్పష్టం చేశారు.
News January 17, 2026
RCB అభిమానులకు గుడ్న్యూస్

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచులు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ విషయాన్ని KA క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వ నిబంధనలు, షరతులకు లోబడి మ్యాచులు నిర్వహించుకోవాలని చెప్పినట్లు పేర్కొంది. కాగా గతేడాది ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. అప్పటి నుంచి స్టేడియంపై నిషేధం ఉంది.
News January 17, 2026
మద్యం అమ్మకాల్లో వృద్ధి

TG: 2025 DEC నాటికి మద్యం అమ్మకాలు, ఆస్తి రిజిస్ట్రేషన్ల ఆదాయంలో రాష్ట్రం గణనీయ వృద్ధిని సాధించింది. ఆస్తి పన్ను వార్షిక లక్ష్యం ₹19,087CR కాగా 59.22% (₹11,304CR) సాధించినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. 2024లో ఇది కేవలం 41.28% మాత్రమే. ఎక్సైజ్ ఆదాయం ₹27,263 CR లక్ష్యంలో 63.38% (₹17,507CR) సాధించింది. 2024లో ఇది 54.96%. ఇక అమ్మకపు పన్ను 2024లో DEC నాటికి 71% సాధించగా ఈసారి అది 67.07%కి తగ్గింది.


