News April 1, 2024

‘కచ్చతీవు’పై స్పందించిన జైశంకర్

image

‘కచ్చతీవు’పై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. ఇది ఇప్పుడు తెరపైకి వచ్చిన అంశం కాదని తెలిపారు. ‘ఈ దీవి గురించి కేంద్రం, తమిళనాడు మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు దాని గురించి 21 సార్లు తమిళనాడుకు సమాధానం ఇచ్చాను’ అని పేర్కొన్నారు. 1947 నాటికి భారత్‌ అధీనంలో ఉన్న దీవిని 5 దశాబ్దాల క్రితం కాంగ్రెస్ శ్రీలంకకు కట్టబెట్టిందని ప్రధాని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 17, 2026

ఆరేళ్ల పదవీ కాలం.. ఒక్క ప్రశ్నా అడగలేదు!

image

మాజీ CJI జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభ MP పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఆరేళ్లలో ఆయన అటెండెన్స్ 53% ఉండగా ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. 2023లో AUGలో ఢిల్లీ సర్వీసెస్ బిల్‌పై చర్చలో మాత్రమే పాల్గొన్నారు. కాగా 2020 మార్చి 16న ఆయనను RSకు కేంద్రం నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ‘నేను ముఖ్యమైన అంశాలు అని భావించినప్పుడు మాట్లాడతాను. నన్ను ఏ పార్టీ నియంత్రించలేదు’ అని 2021లో ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

News March 17, 2026

హైదరాబాద్‌లో UK స్కూల్స్!

image

TG: హైదరాబాద్‌లో యునైటెడ్ కింగ్‌డమ్(UK)కు చెందిన 13 ప్రఖ్యాత స్కూల్స్ తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. ఇందులో భాగంగా యూకే డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ నెల 18న రాష్ట్రంలో పర్యటించనుంది. ఎక్కడెక్కడ క్యాంపస్‌లు నెలకొల్పాలనే దానిపై రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరపనుంది.

News March 17, 2026

IPL స్కోర్‌కార్డ్స్.. ఏది నచ్చింది?

image

ఐపీఎల్ అంటే ఆట మాత్రమే కాదు.. స్క్రీన్‌పై కనిపించే స్కోర్‌కార్డ్ గ్రాఫిక్స్ కూడా స్పెషలే. 2008 నుంచి 2025 వరకు వీటి డిజైన్లు మారుతూ వచ్చాయి. 2014-15 నాటి గ్లాసీ లుక్, 2016 నాటి ఫ్యూచరిస్టిక్ డిజైన్లు ‘బెస్ట్’ అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే 2011-12 నాటి పాత డిజైన్లు, 2023-24లో వాడిన ఇటాలిక్ ఫాంట్లు అంతగా ఆకట్టుకోలేదంటున్నారు. పాత డిజైన్లకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఇంతకీ మీ ఫేవరెట్ ఏది? COMMENT