News December 23, 2024
అమెరికా పర్యటనకు జైశంకర్

విదేశాంగ మంత్రి జైశంకర్ మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. Dec 29 వరకు ఆగ్రరాజ్యంలో పర్యటిస్తారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆ దేశ విదేశాంగ ప్రతినిధులతో చర్చిస్తారు. అలాగే భారత కాన్సుల్ జనరల్ సదస్సులో పాల్గొంటారు. మరికొన్ని రోజుల్లో బైడెన్ పదవీకాలం ముగుస్తుండడం, ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో జైశంకర్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
Similar News
News November 17, 2025
జిన్నింగ్ మిల్లుల బంద్.. రైతుల ఆవేదన!

TG: CCI విధానాలను వ్యతిరేకిస్తూ కాటన్ మిల్లర్లు నిరసనకు దిగారు. L1, L2 కేటగిరీలను ఎత్తివేయాలంటూ నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్ చేపట్టారు. దీంతో రైతులపై మరో పిడుగు పడినట్లయింది. ఇప్పటికే ‘కపాస్’ యాప్లో స్లాట్ బుకింగ్, ఎకరాకు 7 క్వింటాళ్లే కొనుగోలు, తేమ 8-12% మించొద్దన్న నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. వానలు తగ్గడంతో తేమ సమస్య ఉండదనుకుంటే బంద్తో కొనుగోళ్లు ఆగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
News November 17, 2025
వచ్చే ఏడాది నా పెళ్లి: సాయి దుర్గ తేజ్

టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంచి సినిమాలు, గొప్ప జీవితం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలిపేందుకే తిరుమల వచ్చానన్నారు. పెళ్లిపై ఓ జర్నలిస్టు ప్రశ్నించగా ‘వచ్చే ఏడాదిలోనే నా వివాహం ఉంటుంది’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ‘సంబరాల ఏటిగట్టు’ అనే మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇది వచ్చే సంవత్సరం విడుదల కానుంది.
News November 17, 2025
హిందువులపై దాడులు బాధాకరం: షేక్ హసీనా

బంగ్లాదేశ్లో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై దాడులను ప్రోత్సహిస్తోందని మాజీ PM షేక్ హసీనా మండిపడ్డారు. దీంతో వారంతా పారిపోవాల్సి వస్తోందన్నారు. దేశంలో హింస పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యం, లౌకిక నిర్మాణం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆందోళనలతో హసీనా గతేడాది ఆగస్టు 5 నుంచి భారత్లో ఆశ్రయం పొందుతోన్న విషయం తెలిసిందే.


