News December 13, 2024

పాకిస్థాన్‌తో బంధాల‌పై జైశంక‌ర్ కామెంట్‌

image

ఇత‌ర దేశాల మాదిరి పాక్‌తో కూడా మంచి సత్సంబంధాల‌నే కోరుకుంటున్నామ‌ని విదేశాంగ మంత్రి జైశంక‌ర్ తెలిపారు. అయితే, మిగ‌తా దేశాల్లాగే అది కూడా తీవ్రవాదరహితమై ఉండాలన్నారు. ఇది భారత ప్రభుత్వ విధానమ‌ని పేర్కొన్నారు. గ‌త ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకుంటున్న‌ట్టు పాక్ నిరూపించుకోవాలని స్ప‌ష్టం చేశామ‌ని, లేదంటే ద్వైపాక్షిక‌ బంధాల్లో తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించామ‌న్నారు. ఆ బాధ్యత పాక్ చేతుల్లోనే ఉందన్నారు.

Similar News

News November 28, 2025

రాచకొండలో 110 మంది ఈవ్‌టీజర్ల అరెస్ట్

image

రాచకొండ పోలీసులు మహిళల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో నవంబర్ 1 నుంచి 15 వరకు 110 మంది ఈవ్‌టీజర్లను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఫోన్ వేధింపులు 34, సోషల్ మీడియా వేధింపులు 48, ప్రత్యక్ష వేధింపుల ఫిర్యాదులు 53 నమోదయ్యాయి. 7,481 మందికి మహిళా భద్రతపై అవగాహన కల్పించారు. ఫిర్యాదుల కోసం 8712662111 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

News November 28, 2025

కుప్పంలో రూ.305 కోట్లతో ACE యూనిట్

image

AP: పాడి ఉత్పత్తుల సంస్థ ACE ఇంటర్నేషనల్ చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. ఆసియాలోనే తొలిసారి అత్యాధునిక డెయిరీ న్యూట్రీషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించనుంది. ఇందుకోసం రూ.305 కోట్లు వెచ్చించనుంది. ఈ ప్లాంట్‌లో చిన్నపిల్లలు, పెద్దల ఆరోగ్యం, పోషణకు దోహదం చేసే ఉత్పత్తులను తయారుచేసి దేశ విదేశాలకు ఎగుమతి చేయనుంది.

News November 28, 2025

హనుమాన్ చాలీసా భావం – 23

image

ఆపన తేజ సమ్హారో ఆపై|
తీనోం లోక హాంక తే కాంపై||
హనుమంతుడి తేజస్సు ఎంత శక్తిమంతమైనదంటే.. దానిని కేవలం ఆయనే మాత్రమే స్వయంగా నియంత్రించుకోగలడు. ఆయన పెట్టే ఒక్క కేకకు 3 లోకాలు సైతం భయంతో కంపించిపోతాయి. లోకాలను శాసించగల మహాశక్తిని కలిగిన ఆంజనేయుడు శాంతి స్వరూపుడు కూడా! ఆ అపారమైన శక్తిని మనం పూజించినా, కాపాడమని శరణు వేడినా.. తప్పక రక్షిస్తాడు. <<-se>>#HANUMANCHALISA<<>>