News April 8, 2024
జైస్వాల్.. నీ ఆటతీరు మార్చుకో: ఆకాశ్ చోప్రా

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఆట తీరుపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘జైస్వాల్ మళ్లీ స్కోరు చేయలేకపోయాడు. ఆడిన 4మ్యాచుల్లోనూ మూడింట్లో లెఫ్టార్మ్ పేసర్లకే చిక్కాడు. అసలు నువ్వేం చేస్తున్నావ్ యశస్వీ? దయచేసి పట్టుదలగా నిలబడి బ్యాటింగ్ చెయ్యి.. కొన్ని పరుగులు సాధించు’ అని చోప్రా సూచించారు. కాగా గత సీజన్లో ఈ యంగ్ ప్లేయర్ 14 మ్యాచుల్లో 625 రన్స్ చేశారు.
Similar News
News January 30, 2026
7 జిల్లాల్లో 64 లక్షల చొరబాటుదారులు: షా

20 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అస్సాం జనాభాలో సమూల మార్పులు వచ్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 7 జిల్లాల్లోకి దాదాపు 64 లక్షల మంది చొరబడ్డారని ఆరోపించారు. ఈ అక్రమ వలసలను సామాన్యులే ఆపాలని.. అందుకు తుపాకులు పట్టుకొని బార్డర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి BJPకి ఓటు వేస్తే సరిపోతుందన్నారు. 126 అసెంబ్లీ సీట్లున్న అస్సాంలో మార్చి-ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
News January 30, 2026
కొమ్మ కత్తిరింపుల వల్ల కోకో పంటలో లాభమేంటి?

కోకో తోటల్లో రెండేళ్ల వరకు మొక్క సింగిల్ కొమ్మతో పెరిగేలా చూడాలి. పంట నాటిన మూడేళ్ల తర్వాత కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. మే 15 – జులై 15లోపు ప్రధాన కొమ్మలను కత్తిరించాలి. దీని వల్ల SEP,OCT,NOV నెలల్లో పూత బాగా వస్తుంది. నేలను చూసే కొమ్మలను, నేల నుంచి 3 అడుగుల వరకు కొమ్మలు లేకుండా కత్తిరించాలి. పదేళ్లు దాటిన తోటల్లో చెట్లు 7 అడుగులలోపే ఉండేలా చూడాలి. దీని వల్ల కాయ పెరుగుదల బాగుంటుంది.
News January 30, 2026
418 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

తమ ఐటీ డిపార్ట్‌మెంట్‌లో 418 ఉద్యోగాల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాబేస్ మేనేజ్‌మెంట్, తదితర విభాగాల్లో ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి పోస్టులు ఉన్నాయి. నేటి నుంచి ఫిబ్రవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏతో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ <


