News December 3, 2024
సచిన్ రికార్డుకు చేరువలో జైస్వాల్

భారత ప్లేయర్ జైస్వాల్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో 1,280 రన్స్ చేసిన అతను మరో 283 పరుగులు సాధిస్తే భారత్ తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలుస్తారు. 2010లో సచిన్ చేసిన 1,562 పరుగులు IND తరఫున అత్యధికం. ఈ నెలలో మరో 3 టెస్టులు ఆడే అవకాశం ఉన్నందున జైస్వాల్ ఆ రికార్డును బ్రేక్ చేసే ఛాన్సుంది. ఓవరాల్గా మహ్మద్ యూసఫ్(PAK) 1,788 పరుగులతో టాప్లో ఉన్నారు.
Similar News
News December 1, 2025
స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

భారత సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 64.77 పాయింట్లు నష్టపోయి 85,641 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 26,175 వద్ద క్లోజ్ అయ్యింది. హ్యుండాయ్, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ Ltd, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL షేర్లు లాభాలు పొందాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, DLF Ltd, ఒబెరాయ్ రియాల్టీ Ltd షేర్లు నష్టాల్లో ముగిశాయి.
News December 1, 2025
క్యారెట్ సాగు – ముఖ్యమైన సూచనలు

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని ఆగస్టు-డిసెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.
News December 1, 2025
ఇకపై అన్ని ఫోన్లలో ప్రభుత్వ యాప్.. డిలీట్ చేయలేం!

దేశంలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ తయారీ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలిచ్చినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఇకపై తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్ ‘సంచార్ సాథీ’ని డిఫాల్ట్గా ఇవ్వాలని స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ యాప్ను డిలీట్ చేయలేరు. ఇందుకు 90 రోజుల గడువు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ అంశంపై అటు ప్రభుత్వం, ఇటు మొబైల్ కంపెనీలు అధికారికంగా స్పందించలేదు.


