News July 1, 2024
వరల్డ్ కప్‌తో జైస్వాల్ పోస్ట్.. సూర్య ఫన్నీ సెటైర్

T20WC గెలిచిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని భారత యువ ఓపెనర్ జైస్వాల్ ఇన్‌స్టాలో ఫొటో పోస్టు చేశారు. కాగా ఆ పోస్టుపై ఫన్నీగా స్పందించిన సూర్యకుమార్ యాదవ్ ‘వర్ణించకు పోయి పడుకో’ అని కామెంట్ చేశారు. అయితే ‘ఆడే ఛాన్స్ ఎలాగూ ఇవ్వలేదు. కనీసం మాట్లాడే ఛాన్స్ అయినా ఇవ్వరా?’ అని నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. WCకి సెలక్టయిన జైస్వాల్‌కు ప్లేయింగ్11లో ఛాన్స్ దొరకని విషయం తెలిసిందే.
Similar News
News January 28, 2026
ఖమ్మం: ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ అమలు: సీపీ

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేటి నుంచి అమల్లోకి వచ్చిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎన్నికల నిర్వహణను ప్రశాంతంగా సాగించేందుకు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘనలకు ఎలాంటి అవకాశం ఇవ్వమని, నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు పెంచామన్నారు.
News January 28, 2026
వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నాం: ముర్ము

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. గత పదేళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామని చెప్పారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, 10 కోట్ల మందికి LPG కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు.
News January 28, 2026
2023లోనూ ఆ విమానానికి ప్రమాదం!

అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం గురించి సంచలన విషయం బయటికొచ్చింది. ఇదే విమానం 2023 సెప్టెంబర్‌లోనూ ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. VSR వెంచర్స్ ఆపరేట్ చేస్తున్న Learjet 45 ఎయిర్ క్రాఫ్ట్ విశాఖపట్నం నుంచి ముంబై వెళ్తుండగా ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. భారీ వర్షం కారణంగా రన్ వే నుంచి పక్కకు జారిపోయింది. ఆ ఘటనలో 8 మంది గాయపడ్డారు. ఇప్పుడు కూడా ల్యాండింగ్ సమయంలోనే ప్రమాదం జరగడం గమనార్హం.


