News October 26, 2024
ఇండియాలో అత్యధిక పరుగులు చేసిన జైస్వాల్

భారత్‌లో జరిగిన టెస్టుల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ అగ్రస్థానానికి చేరారు. 2024లో భారత్‌లో జరిగిన 9 టెస్టుల్లో జైస్వాల్ 66 సగటుతో 1056 రన్స్ చేశారు. వాటిలో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా ముగిసిన మ్యాచ్‌లో 77 రన్స్ చేసిన యశస్వి.. దిగ్గజ బ్యాటర్ గుండప్ప విశ్వనాథ్ 1979లో (13 మ్యాచుల్లో 1047 రన్స్) నెలకొల్పిన రికార్డును అధిగమించారు.
Similar News
News February 20, 2026
అభిషేక్.. దొరికిపోతావ్ జాగ్రత్త: అమీర్

టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శనపై పాక్ మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్ హెచ్చరించారు. అభిషేక్ ప్రతీ బంతిని భారీ షాట్‌గా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సరికాదని సూచించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో క్వాలిటీ బౌలర్లు ఉంటారు కాబట్టి వీక్‌నెస్ పసిగట్టేస్తారని తెలిపారు. పాక్ ఓపెనర్ ఆయుబ్ తొలినాళ్లలో ఇలాగే ఆడి ఇప్పుడు ఆఫ్ సైడ్ ఆడేందుకు తడబడుతున్నాడని.. అభిషేక్ పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు.
News February 20, 2026
సర్పంచ్‌లకు గుడ్ న్యూస్

AP: సర్పంచ్‌లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరిలో చేసిన తీర్మానాల ప్రకారం నిధులు వాడుకోవచ్చని పేర్కొంది. పనులు చేసిన తర్వాత మెజర్‌మెంట్స్ బుక్స్‌లో నమోదు చేస్తే బిల్లులు చెల్లించవచ్చని వెల్లడించింది.
News February 19, 2026
RCBకి బంపర్ ఆఫర్.. $1.8బిలియన్ల బిడ్!

యాజమాన్య హక్కులపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బంపర్ ఆఫర్ వచ్చింది. స్టార్ ఫుట్‌బాల్ టీమ్ మాంచెస్టర్ యునైటెడ్ కో-ఓనర్ అవ్రామ్ గ్లేజర్ కొనుగోలుకు ఆసక్తి చూపించారు. 1.8 బిలియన్ డాలర్లకు (సుమారు ₹16,399కోట్లు) బిడ్ వేసినట్లు సమాచారం. ఇప్పటికే బ్లాక్‌స్టోన్, కార్లైల్ గ్రూప్ సహా బడా సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో RCB ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం Diageo సంస్థ RCBకి ఓనర్‌గా ఉంది.


