News November 23, 2024
సిక్సర్లలో జైస్వాల్ రికార్డు
టీమ్ ఇండియా బ్యాటింగ్ సెన్సేషన్ యశస్వీ జైస్వాల్ అరుదైన ఫీట్ సాధించారు. టెస్టు ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు (34) కొట్టిన క్రికెటర్‌గా నిలిచారు. 2014లో న్యూజిలాండ్ క్రికెటర్ మెక్కల్లమ్ 33 సిక్సర్లు బాదారు. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో జైస్వాల్ 2 సిక్సర్లు కొట్టి మెక్కల్లమ్ రికార్డును బద్దలు కొట్టారు.
Similar News
News November 23, 2024
జగన్ వద్ద మంత్రిగా చేసినందుకు బాధపడుతున్నా: బాలినేని
AP: వైఎస్ జగన్ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో తన ప్రమేయం లేదని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సంబంధిత పత్రాలపై అప్పటి మంత్రిగా తాను సంతకం చేయలేదని తెలిపారు. క్యాబినెట్లో చర్చించకుండానే యూనిట్ రూ.2.49తో ఒప్పందం చేసుకున్నారన్నారు. ఈ కేసులో జగన్ పాత్ర ఉంటే క్షమించరానిదని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తే ఆయన వద్ద మంత్రిగా పనిచేసినందుకు బాధపడుతున్నానని చెప్పారు.
News November 23, 2024
త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న తమన్నా, విజయ్?
ప్రేమ జంట తమన్నా భాటియా, విజయ్ వర్మ పెళ్లికి సిద్ధమైనట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ముంబైలో కలిసి ఉండటానికి వీరు ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వివాహ పనులు మొదలుపెట్టారని, అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ కబురు ఉంటుందని టాక్. లస్ట్ స్టోరీస్-2 తర్వాత రిలేషన్‌లో ఉన్నట్లు తమన్నా-విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
News November 23, 2024
తల్లిని కోల్పోయిన పిల్లలను దత్తత తీసుకునే ఉడతలు!
మాతృత్వం ఏ జీవిలోనైనా ఒకేలా ఉంటుందని వర్సిటీ ఆఫ్ గ్వెల్ఫ్ పరిశోధనలో తెలిసింది. అల్బెర్టా విశ్వవిద్యాలయం& మెక్‌గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులతో కలిసి 20 ఏళ్లు పరిశోధన చేసింది. ఆహారం కోసం గొడవకు దిగే ఉడతలు తల్లిని కోల్పోయిన ఉడత పిల్లలను దత్తత తీసుకొని వాటికి తోడుగా ఉంటాయని గుర్తించింది. ముఖ్యంగా ఎర్ర ఉడతలు ఇందుకు ముందుంటాయని వెల్లడైంది. ఇలా ఇతర పిల్లలను తమవాటిలా చూసుకోవడం కూడా అరుదేనని తెలిపింది.