News May 3, 2024

15 ఏళ్ల నాటి మాట నిలబెట్టుకున్న జక్కన్న!

image

బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే, నిర్మాత కేఎల్ నారాయణకు 15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం ఆయన నిలబడ్డారట. ఈ విషయాన్ని నిర్మాత తాజాగా వెల్లడించారు. ‘నేను అడక్కపోయినా వాళ్లే నా బ్యానర్‌లో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అందుకు నేను కృతజ్ఞుడిని. బడ్జెట్ ఇంత అనేమీ అనుకోలేదు కానీ ఎంతైనా ఖర్చు పెడతా’ అని తెలిపారు.

Similar News

News March 31, 2026

ప్రతి నెలా నాలుగో శనివారం హెల్త్ క్యాంపులు: సీఎం

image

AP: ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కోసం ఉద్యమంలా కృషి చేయాలని CM CBN అధికారులను ఆదేశించారు. సంజీవని ప్రాజెక్టుపై సమీక్షలో మాట్లాడుతూ ‘ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, వైద్యాధికారులు జనాల్లోకి వెళ్లాలి. ప్రతి నాలుగో శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్ పేరుతో గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. ఏడాదిలో 56L మందికి వైద్య పరీక్షలు చేయాలి. ఫలితాలను 48గంటల్లో వాట్సాప్ ద్వారా పంపాలి’ అని సూచించారు.

News March 31, 2026

ఆ దేశాలకు ట్రంప్ ఆప్షన్లు

image

హార్ముజ్‌లో నౌకల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చూస్తామని గతంలో పలు దేశాలకు హామీ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు మాట మార్చారు. ‘యుద్ధంలో పాల్గొనని UK లాంటి దేశాలకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. మా దేశం నుంచి ఇంధనం కొనాలి. లేదంటే ధైర్యం తెచ్చుకొని సొంతంగా హార్ముజ్‌ నుంచి చమురు తెచ్చుకోవాలి. మీ కోసం మీరే పోరాడటం నేర్చుకోండి. అమెరికా మీకే సాయం చేయదు’ అని SMలో పోస్టు చేశారు.

News March 31, 2026

మొబైల్ డేటాను తెగ వాడేస్తున్నారు

image

గతేడాది దేశంలో ఒక్కో వ్యక్తి నెలవారీ సగటు మొబైల్ డేటా వినియోగం 31GBగా(2024లో 27.5GB) ఉందని నోకియా నివేదిక వెల్లడించింది. టోటల్ మంత్లీ డేటా వాడకం 27 ఎక్సాబైట్లు(ఒక ఎక్సాబైట్=100 కోట్ల GB) దాటిందని తెలిపింది. బ్రాడ్‌బ్యాండ్ ట్రాఫిక్‌లో 5G వాటా 47%గా ఉందంది. AI అప్లికేషన్స్, 4K వీడియోల స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్ కారణంగా డేటా వాడకం పెరిగిందని పేర్కొంది.
* మీరు డేటాను ఎక్కువగా దేనికోసం వాడుతున్నారు?