News July 21, 2024

‘జల’కళకళలాడుతున్న ప్రాజెక్టులు

image

AP: రాష్ట్రంలో ప్రాజెక్టులు ‘జల’కళకళలాడుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వరద వెల్లువెత్తుతోంది. శ్రీశైలంలో గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 817 అడుగులకు చేరింది. జూరాల నుంచి దీనిలోకి 97,208 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రకాశం బ్యారేజీలో 14 గేట్ల ద్వారా 10,150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం స్పిల్‌వే వద్ద నీటి మట్టం 31.7 మీటర్లకు చేరింది.

Similar News

News November 28, 2025

ఖమ్మం: 15 మంది నోడల్ అధికారుల నియామకం

image

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను 13 విభాగాలుగా విభజించి 15 మంది నోడల్ అధికారులను నియమించారు. వీరందరికీ గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ఎన్నికల కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు గాను వీరిని నియమిస్తూ ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 15 మంది ఒక్కో రకమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

News November 28, 2025

విమాన వేంకటేశ్వరస్వామి విశిష్టత

image

తిరుమల గర్భాలయంపై ఉన్న గోపురాన్ని ఆనంద నిలయ విమానం అంటారు. ఈ గోపురంపై కొలువై ఉన్న స్వామివారి రూపమే ‘విమాన వేంకటేశ్వర స్వామి’. విమానం అంటే కొలవడానికి వీలుకాని అపారమైన శక్తి కలిగినది అని అర్థం. ఇది భక్తులకు నేరుగా వైకుంఠవాసుడిని చూసిన అనుభూతినిస్తుంది. ఈ గోపురంలో మొత్తం 60 మంది దేవతా మూర్తులు ఉంటారు. ఈ స్వామిని దర్శించడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 28, 2025

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: పవన్

image

AP: కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని Dy.CM పవన్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయన్నారు. ఇవాళ్టి కార్యక్రమం భవనాలకే కాకుండా ఏపీ భవిష్యత్తుకు పడిన పునాది అని పేర్కొన్నారు.