News December 30, 2024
రూ.80,112 కోట్లతో తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టు: సీఎం
APని కరవు రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. రూ.80,112 కోట్ల అంచనాతో తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టు(బనకచర్ల ప్రాజెక్టు) ప్రణాళికను వివరించారు. ‘మొదట గోదావరి నుంచి కృష్ణా నదికి నీళ్లు తరలిస్తాం. అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్(అనంతపురం)కు, అటు నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు జలాలను తీసుకెళ్తాం. దీంతో 80 లక్షల మందికి తాగు, సాగు నీరు అందుతుంది’ అని తెలిపారు.
Similar News
News January 2, 2025
ఈ చిన్న మార్పులు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి!
మారిన జీవనశైలి వల్ల వచ్చే 42% క్యాన్సర్లను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మద్యపానం & ధూమపానం మానుకుంటే, వీటివల్ల వచ్చే 19% క్యాన్సర్లు నివారించవచ్చు. అధిక బరువు ఉంటే తగ్గించుకోండి. శారీరకంగా చురుకుగా ఉండండి. పోషక ఆహారాన్ని తీసుకోండి. అధిక సూర్యరశ్మి వల్ల అనేక చర్మ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ధూమపానం చేసేవారిని స్క్రీనింగ్ చేయడం ద్వారా లంగ్ క్యాన్సర్‌ను ముందే గుర్తించి చికిత్స చేయొచ్చు.
News January 2, 2025
శుభ్‌మన్ గిల్‌కు CID నోటీసులు
గుజరాత్ టైటాన్స్ ప్లేయర్స్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, రాహుల్ తెవాటియాకు గుజరాత్ CID నోటీసులు అందించింది. పొంజి స్కీమ్‌లో జరిగిన రూ.450 కోట్ల అవకతవకలపై వీరికి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరందరిని CID అధికారులు ప్రశ్నిస్తారని సమాచారం. వీరందరూ ఈ చిట్ ఫండ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు నిర్థారించారు. గిల్ రూ.1.95 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు గుర్తించారు.
News January 2, 2025
తెలుగు తేజాలకు అర్జున పురస్కారాలు
కేంద్రం ప్రకటించిన క్రీడా పురస్కారాల్లో తెలుగు తేజాలు ఇద్దరు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జివాంజి దీప్తిలకు అర్జున అవార్డులు ఇవ్వనున్నట్లు కేంద్ర క్రీడల శాఖ కాసేపటి క్రితం పేర్కొంది. దీప్తిది ఉమ్మడి వరంగల్ జిల్లా కాగా.. జ్యోతి విశాఖ వాసి.